అన్వేషించండి

US Iran War: అమెరికన్లను సముద్రంలో ముంచేస్తాం! అంత సీన్ లేదన్న డొనాల్డ్ ట్రంప్ !

US President Trump: ఇరాన్ నేవీతో పాటు సైనిక శక్తిని నిర్వీర్యం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధం తనవల్లే ఆగిందన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ (Mojtaba khamenei ) హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని, అందుకోసం కొత్త రూల్స్ తీసుకొస్తామని తెలిపారు. తమ అణు, క్షిపణి సామర్థ్యాలను రక్షించుకుంటామని పేర్కొన్న ఆయన.. పర్షియన్ గల్ఫ్‌కు వచ్చే అమెరికన్లను సముద్రంలో ముంచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్న సమయంలో ఇరాన్ అధినేత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత తొలిసారి మోజ్తబా ఖమేనీ ఒక లిఖితపూర్వక ప్రకటనను విడుదల చేయగా ప్రభుత్వ టీవీ యాంకర్ చదివి వినిపించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు ఉన్న ఏకైక స్థలం ఆ సముద్రపు అగాధాలేనని తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాంత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. దేవుని సహాయం, తమ శక్తితో పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి అమెరికా లేని ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని లేఖలో తెలిపారు. ఇక్కడి ప్రజల పురోగతి, శ్రేయస్సుకు కృషి చేస్తానన్నారు. 

మేం, పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్‌కు అవతల ఉన్న మా పొరుగువారు ఒకే పనిని పంచుకుంటున్నామని అన్నారు. వేల కిలోమీటర్ల దూరం నుండి దురాశ, ద్వేషంతో ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఈ ప్రాంతంలో చోటు లేదు. వారిని సముద్రంలో ముంచేస్తామని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన
అమెరికా నేవీ దిగ్బంధనం చేసి ఇరాన్ ఓడలను సముద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్న సమయంలోనే మొజ్తబా ఖమేనీ లేఖ వచ్చింది. ఇరాన్ చమురు వ్యాపారంపై గత కొన్ని రోజులుగా ఒత్తిడి పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో జూన్ డెలివరీ కోసం బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 126 డాలర్లకు చేరుకుంది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణే దీనికి కారణం. దీనికి ఎలా సమాధానం చెప్పాలని డొనాల్డ్ ట్రంప్ నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు.

హర్మూజ్‌లో అమెరికా దిగ్బంధనం ఉద్దేశం ఏమిటి?
హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ దిగ్బంధనం ఉద్దేశం ఇరాన్ తన చమురును విక్రయించకుండా అడ్డుకోవడం, వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడం. తద్వారా ఆ దేశానికి కీలకమైన రాబడి వనరు లేకుండా చేయాలనేది ట్రంప్ ప్లాన్. అలాగే, ఇరాన్ చమురు ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితిని తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే చమురును నిల్వ చేయడానికి వారికి చోటు ఉండదు. 

ఇరాన్‌తో ఉద్రిక్తత.. యుద్ధంగా భావించడం లేదన్న డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు ఇరాన్‌కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా చేపట్టిన సైనిక చర్యలను తాను యుద్ధంగా పరిగణించడం లేదని పేర్కొన్నారు. ఈ చర్యలో ఇరాన్ నేవీ, వాయు సేన భారీగా నష్టపోయాయని, ఇప్పుడు ఆ దేశం ఒప్పందం కోసం ఆత్రుతగా ఉందని పేర్కొన్నారు. వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. ఇరాన్ సైనిక సామర్థ్యం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయిందని క్లెయిమ్ చేశారు. ఇరాన్ డ్రోన్ తయారీ సామర్థ్యం సుమారు 82 శాతం తగ్గిందని, వారి అణు కార్యక్రమం కూడా పూర్తిగా నిర్వీర్యం అవుతుందన్నారు. 

భారత-పాకిస్తాన్ సంబంధాల ప్రస్తావన
ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించానని ట్రంప్ ప్రస్తావించారు. ఇప్పటివరకు 8 ప్రధాన యుద్ధాలను తాను సద్దుమణిగేలా చేశానని, ఇందుకుగానూ పలు దేశాలు తనకు కృతజ్ఞతా లేఖలు పంపాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి తాను టారిఫ్ లను ఆయుధంగా ఉపయోగించానని ట్రంప్ చెప్పారు. యుద్ధం కొనసాగితే కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. తన జోక్యం వల్లే సంభవించబోయే భారీ నష్టాన్ని నివారించానని పేర్కొన్నారు.

ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనం 
ఇరాన్ పట్ల అమెరికా తన కఠిన వ్యూహాన్ని కొనసాగిస్తుందని అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనం సమర్థవంతంగా కొనసాగుతోందని, దీని ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తోందని అన్నారు. ఇరాన్ ఆర్థిక స్థితి నిరంతరం బలహీనపడుతోంది, వారి నేవీ, సైనిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget