Miss Universe 2023: మిస్ యూనివర్స్ 2023గా షెన్నిస్ పలాసియోస్, అనౌన్స్ చేయగానే ఎలా ఏడ్చేసిందో చూడండి
Miss Universe 2023: మిస్ యూనివర్స్ 2023 గా నికరాగ్వాకి చెందిన షెన్నిస్ ఎంపికైంది.
Miss Universe 2023:
2023 సంవత్సరానికి మిస్ యూనివర్స్‌గా (Miss Universe) నికరాగ్వాకి చెందిన షెన్నిస్ పలాసియోస్ ( Sheynnis Palacios) ఎంపికైంది. దాదాపు 90 దేశాల నుంచి కంటిస్టెంట్స్ పోటీ పడగా 72వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్ సొంతం చేసుకుంది. థాయ్‌లాండ్‌కి చెందిన యాంటోనియా పార్స్‌లిడ్ (Anntonia Porsild) రన్నరప్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాకి చెందిన Moraya Wilson మూడో స్థానంలో నిలిచింది. 2022 మిస్ యూనివర్స్ ఆర్ బోనీ గాబ్రియేల్ (R'Bonney Gabriel) షెన్నిస్ పలాసియోస్‌కి కిరీటం తొడిగింది. మహిళా హక్కుల కోసం పోరాడుతున్న షెన్నిస్ పేరు..మిస్ యూనివర్స్ కిరీటంతో ప్రపంచవ్యాప్తంగా మారు మోగుతోంది. అయితే...భారత్ తరపున శ్వేత శ్రద్ధా (Shweta Sharda) పోటీ పడినప్పటికీ...షెన్నిస్ ఆమెని వెనక్కి నెట్టింది. ఎల్ సాల్వడార్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో మిస్ యూనివర్స్ పేరు ప్రకటించారు.
MISS UNIVERSE 2023 IS @Sheynnispalacios_of !!!! 👑 🇳🇮@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/cSHgnTKNL2
— Miss Universe (@MissUniverse) November 19, 2023
షెన్నిస్ ఎంపికలో చివరి క్వశ్చన్ చాలా కీలకంగా మారింది. "ఓ ఏడాది పాటు వేరే మహిళగా మీరు జీవించాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు..? వాళ్లనే ఎందుకు ఎంపిక చేసుకుంటారు" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి షెన్నిస్ పలాసియోస్ ఆసక్తికర సమాధానమిచ్చారు. 18వ శతాబ్దానికి చెందిన బ్రిటీష్ ఫిలాసఫర్, ఫెమినిస్ట్ మేరీ వాల్‌స్టోన్ క్రాఫ్ట్ (Mary Wollstonecraft) పేరు చెప్పారు. అప్పట్లో మహిళలపై ఉన్న ఆంక్షల్ని చెరిపేసి మరీ పోరాటం చేశారు మేరీ వాల్‌స్టోన్. అలాంటి వ్యక్తుల వల్లే ఇప్పుడు మహిళలు ఎలాంటి హద్దుల్లేకుండా ఎదుగుతున్నారని చెప్పింది షెన్నిస్. ఈ సమాధానానికి ఫ్లాట్ అయిన నిర్వాహకులు ఆమెకి మిస్ యూనివర్స్ కిరీటం అందించారు.
MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m
— Miss Universe (@MissUniverse) November 19, 2023