Microsoft Palestine: గాజా మారణకాండ వెనుక మైక్రోసాఫ్ట్ ఉందా ? - సొంత ఉద్యోగులే ఎందుకు నిరసన తెలుపుతున్నారు ?
Microsoft: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు .. ఆ సంస్థ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటీవ్ ల ముందు నిరసన తెలిచేస్తున్నారు. ఇది వైరల్ అవుతోంది.

Microsoft employees protest goes viral: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న హింసాకాండకు మైక్రోసాఫ్ట్ కారణమని ఆ సంస్థలోని ఉద్యోగులే నిరసన వ్యక్తం చేయడం వైరల్ గామారుతోంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2025, మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో ఉద్యోగులు ఈ అంశంపై నిరసన వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మంగళవారం రోజున సియాటిల్‌లో జరిగిన మైక్రోసాఫ్ట్ బిల్డ్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో సత్య నాదెళ్ల కీనోట్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగి జో లోపెజ్ అడ్డుకున్నాడు. మైక్రోసాఫ్ట్ పాలస్తీనియన్లను ఎలా చంపుతోందో చూపించండి..ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు అజూర్ ఎలా శక్తినిస్తోందో చూపించండి అని నినాదాలు చేశాడు. అజూర్ హార్డ్‌వేర్ సిస్టమ్స్ టీమ్‌లో ఫర్మ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
జో లోపెజ్‌ను సెక్యూరిటీ వెంటనే బయటకు తీసుకెళ్లింది. అతను తర్వాత వేలాది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఒక ఇమెయిల్ పంపాడు. ఇందులో కంపెనీ నాయకత్వం నిశ్శబ్దంగా ఉన్నందుకు నిరాశను వ్యక్తం చేశాడు. అజూర్ సాంకేతికత ఇజ్రాయెల్ సైన్యం చేత పాలస్తీనియన్లపై ఉపయోగిస్తోందని ఇది అనైతికమని అన్నాడు. అంతకు 2025లో మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో, సత్య నాదెళ్ల, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ స్టేజ్‌పై ఉన్నప్పుడు ఇద్దరు ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేశారు. వన్య అగర్వాల్ అనే భారత సంతతి మహిళ, మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సేవలు ఇజ్రాయెల్ “ఆటోమేటెడ్ అపార్ట్‌హైడ్ , జెనోసైడ్ సిస్టమ్స్”కు సాంకేతిక బ్యాక్‌బోన్‌గా ఉన్నాయని ఆరోపించింది.
నో అజూర్ ఫర్ అపార్ట్‌హైడ్ పేరుోత కొంత మంది ఉద్యోగులు ఓ గ్రూపుగా ఏర్పడి నిరసనలు తెలియచేస్తున్నారు. ఇందులో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌కు క్లౌడ్ , ఏఐ సేవలను నిలిపివేయాలని వీరు డమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం అజూర్ , ఓపెన్‌ఏఐ సాంకేతికతలను మాస్ సర్వైలెన్స్, ఫోన్ కాల్స్, టెక్స్ట్‌లు, ఆడియో సందేశాలను ట్రాన్స్‌క్రైబ్ చేయడానికి, అనువదించడానికి ఉపయోగిస్తోందని ఆరోపిస్తోంది.
A pro-Palestine Microsoft worker protested the leadership of the company for supporting genocide in #Gaza. pic.twitter.com/ybUcd20tcl
— Palestine Info Center (@palinfoen) May 19, 2025
ఇజ్రాయెల్ సైన్యం అజూర్ క్లౌడ్ సేవలను మాస్ సర్వైలెన్స్ మరియు డేటా సేకరణ కోసం ఉపయోగిస్తోందని, ఇది గాజాలో యుద్ధ నేరాలకు దోహదపడుతోందని నిరసనకారులు అంటున్నారు. జో లోపెజ్ తన ఇమెయిల్‌లో మైక్రోసాఫ్ట్‌ను “ నీతిమంతమైన బిగ్ టెక్”గా భావించి చేరానని, కానీ ఇజ్రాయెల్ కాంట్రాక్ట్‌ల వల్ల తన నమ్మకం దెబ్బతిన్నదని పేర్కొన్నాడు. సత్య నాదెళ్ల మరియు మైక్రోసాఫ్ట్ నాయకత్వం ఈ నిరసనలపై ప్రత్యక్షంగా స్పందించలేదు . కంపెనీ తన కాంట్రాక్ట్‌లను సమర్థిస్తూ, అవి చట్టబద్ధమైనవని స్పష్టం చేసింది. అయితే ఇదే సమస్యపై గూగుల్‌లో కూడా నిరసనలు జరిగాయి. గూగుల్ క్లౌడ్ కాంట్రాక్ట్‌లపై గతంలో నిరసన వ్యక్తం చేశాడు.





















