కరాచీలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం, వీధిలోనే కాల్చి చంపిన దుండగులు
Qaiser Farooq Shot Dead: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కైసర్ ఫరూక్‌ని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
Qaiser Farooq Shot Dead:
ఉగ్రవాది హతం..
పాకిస్థాన్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ల జాబితాలో ఉన్న ముఫ్తీ కైసర్ ఫరూక్‌ని (Mufti Qaiser Farooq) గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్థాన్‌లోని కరాచీలో ఫరూక్ హత్యకు గురైనట్టు అక్కడి మీడియా వెల్లడించింది. లష్కరే తోయిబా సంస్థకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాదుల్లో ఫరూక్ కూడా ఒకడు. అంతే కాదు. ఈ ఉగ్రసంస్థ స్థాపించిన వాళ్లలో ఒకడు కూడా. ముంబయిలో 26/11 దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్ (Hafiz Saeed)కి రైట్ హ్యాండ్‌గా పని చేశాడు కైసర్ ఫరూక్. సామనాబాద్ వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు వచ్చి అతడిని కాల్చి చంపినట్టు పాక్‌కి చెందిన Dawn వార్తాపత్రిక వెల్లడించింది. బులెట్ గాయాలతో కింద పడిపోయిన ఫరూక్‌ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఫరూక్‌పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దాడిలో ఓ మైనర్ బాలుడు కూడా గాయపడినట్టు సమాచారం. గత నెలలోనూ లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాది మౌలానా జియర్ రహమాన్ (Maulana Ziaur Rahman)ని గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్చి చంపారు. సోషల్ మీడియాలో ఈ దాడికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి ఆ దాడికి సంబంధించినవేనా కాదా అన్నది ఇంకా ధ్రువీకరించలేదు.
Most Wanted LeT terrorist Qaiser Farooq shot dead by unknown people in Karachi, Pakistan 🔥🔥
— shukumar (@shukumar27) October 1, 2023
He was one of the founding members of Lashkar-e-Tayyeba and a close associate of Global Terrorist Hafiz Saeed.
All Terrorist Organizations are in shock & coma after back to back incident pic.twitter.com/ojUiyktfyX
హఫీజ్ సయీద్‌కి 31 ఏళ్ల జైలు శిక్ష
26/11 సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు గతేడాది ఏప్రిల్‌లో 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో శిక్ష పడింది. న్యాయస్థానం అతని ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని, ₹ 3,40,000 జరిమానా విధించాలని ఆదేశించింది. హఫీజ్ సయీద్ నిర్మించినట్లు ఆరోపిస్తున్న మసీదు, మదర్సా స్వాధీనం చేసుకోనున్నట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 70 ఏళ్ల హఫీజ్ సయీద్ గతంలో ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ చేసిన పలు కేసుల్లో శిక్ష అనుభవించారు. 2020లో కూడా అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. పాకిస్తాన్లో వివిధ రూపాల్లో నిర్బంధంలో ఉండేవారు. పాకిస్తాన్ బయట కూడా సంవత్సరాలు గడిపారు. కొన్నిసార్లు గృహనిర్బంధంలో ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడల్లా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రసంగాలు చేస్తూ తిరుగుతున్నారు.
Also Read: చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం