అన్వేషించండి

Suicide Drone: కిమ్ చేతిలో సూసైడ్ ఆయుధం, నార్త్ కొరియా నియంత గట్టిగానే ప్లాన్ చేశారా ?

Kim Jong Un | ఉత్త‌ర‌ కొరియా మిల‌ట‌రీ చేతికి కొత్త అస్త్రం చేరింది. ఆ దేశ శాస్త్ర‌వేత్త‌లు త‌యారు చేసిన‌ సూసైడ్ డ్రోన్ ను దేశాధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించారు.

Suicide Drone Tested In North Korea  రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధాల‌పై యావత్‌ ప్రపంచం దృష్టి సారించగా నార్త్ కొరియా చీఫ్ కిమ్‌ జాంగ్ ఉన్ (Kim Jong Un) తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. ఉత్త‌ర కొరియా అమ్ముల పొదిలో మ‌రో కొత్త అస్త్రం వ‌చ్చి చేరింది. ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ సూసైడ్ డ్రోన్‌ను ప‌రిశీలించారు. అందుకు సంబందించిన ఫొటోలు ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతున్నాయి. సైన్యాన్ని బ‌లోపేతం చేసే దిశ‌గా ఈ డ్రోన్ల‌ను త‌యారు చేసిన‌ట్టు ఆ దేశం ప్ర‌క‌టించింది. భూ ఉప‌రితలం, స‌ముద్ర ఉప‌రితలంపై ఉన్న లక్ష్యాల‌ను ఛేదించే విధంగా వాటిని అభివృద్ధి చేశారు. పూర్తిగా తెలుపు రంగులో ఉండే ఆ డ్రోన్ల‌కు చివ‌ర్లో X ఆకారంలో ఉండే రెక్క‌లున్నాయి. కొరియా అధికారిక మీడియా దీనికి సంబంధించి ఫొటోల‌తో కూడిన వీడియోను విడుద‌ల చేసింది.

డ్రోన్ ప‌నితీరును ఆ దేశాధ్య‌క్షుడు కిమ్ ప‌రిశీలించారు. పంట పొలాల మ‌ధ్య‌న ఉన్న యుద్ధ ట్యాంకును ఈ సూసైడ్ డ్రోన్ ధ్వంసం చేయ‌డం వీడియోలో స్ప‌ష్టంగా తెలుస్తోంది. తెలుపు రంగులో ఉండే ఓ డ్రోన్ గాల్లోకి లేవ‌డం, వెళ్లి యుద్ధ ట్యాంకును ఢీకొట్ట‌డం, వెంట‌నే భారీ పేలుడు సంభవించ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. ఒక డ్రోన్ ల‌క్ష్యంపై దాడి చేస్తే, కొసి పేలిపోతుంటే కొన్ని డ్రోన్లు దాడి చేసి తిరిగి వెన‌క్కి రావ‌డం క‌నిపిస్తుంది. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన ఈ డ్రోన్లను పెద్ద ఎత్తున త‌యారు చేసి సైన్యానికి అందించాల‌ని కిమ్ ఆ దేశ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

ద‌క్షిణ కొరియా, అమెరికా క‌లిసి సంయుక్త సైనిక విన్యాసాలు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా సూసైడ్ డ్రోన్ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అమెరికాకి హెచ్చ‌రిక‌లు పంపుతున్న ఉత్త‌ర కొరియా.. తాజా ప్ర‌యోగంతో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేసిన‌ట్ట‌యింది. అమెరికాలోని ల‌క్ష్యాల‌ను సైతం చేదించ‌గ‌ల దీర్ఘ‌శ్రేణి క్షిప‌ణుల‌ను సైతం సిద్ధం చేసే ప‌నిలో ఉత్త‌ర‌కొరియా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. 

రాబోయే రెండు నెల‌ల్లో అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న త‌రుణంలో ఆ దేశంపై ఒత్తిడి పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా కిమ్ ఈ ప్ర‌యోగం చేసిన‌ట్టు నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. త‌మ దేశంలో అణ్వస్త్ర సంప‌ద‌కు కొదువ లేద‌ని ప్ర‌క‌టించ‌డమే ఈ ప్ర‌యోగం వెనుక ఉద్దేశ్యం అయ్యుండొచ్చ‌ని తెలుస్తోంది. సైనిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో ఈ సూసైడ్ డ్రోన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆ దేశం భావిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget