Great Old Swimmer : స్విమ్మింగ్ లెజెండ్ - 83 ఏళ్ల వయసులో ఒంటరిగా ఫసిఫిక్ మహాసముద్రాన్ని ఈదేశాడు !
నడవడానికే కాళ్లుచేతులు సహకరించని వయసులో ఫసిఫిక్ మహా సముద్రాన్నీ ఈదేశాడు జపాన్‌కు చెందిన పెద్దాయన. ఈయన గురించి తెలిస్తే..
Great Old Swimmer : ఆయన వయసు 83 ఏళ్లు. గట్టిగా నడవడానికే కష్టపడే వయసు. కానీ ఆయన ఏకంగా ఓ మహా సముద్రాన్ని ఈదేశాడు. జపాన్‌కు చెందిన ఈ పెద్దాయన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిత్. మహాసముద్రాలన్నింటిలో అతిపెద్దది ఫసిఫిక్ మహాసముద్రం. దీన్ని మహా మహా స్విమ్మర్లే ఈదడం కష్టం. కానీ 83 ఏళ్ల ఓ వృద్ధుడు ఒంటరిగా చుట్టొచ్చేశాడు. ఒంటరిగా సముద్రయానం చేసిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించాడు.
Before he set off, Kenichi Horie said his only fear about sailing solo non-stop across the Pacific Ocean was his age. But the 83-year-old proved it was not an obstacle at all, as he became the world’s oldest person to complete the challenge https://t.co/fyL0wanmiR
— Guardian sport (@guardian_sport) June 4, 2022
జపాన్‌కి చెందిన 83 ఏళ్ల కెనిచి హోరీకి ( Kenichi Horie ) చిన్నతనం నుంచే సముద్రయానమంటే అమితమైన ఆసక్తి . ఈ ఆసక్తితోనే 23 ఏళ్ల వయసులోనే సముద్రయానం చేశాడట. 1962లో జపాన్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు పసిఫిక్ మహాసముద్రం వీదుగా ఒంటరిగా ప్రయాణించాడు. ఇలా ప్రయాణించిన వ్యక్తి.. ప్రపంచంలోనే తొలి వ్యక్తి హోరీ కావడం విశేషం. కానీ అక్కడకు ఈదుకుంటూ వెళ్లాడు కానీ ఆ దేశంలోకి వెళ్లడానికి పాస్ పోర్టు లేదు. దాంతో వెనక్కి రావాల్సి వచ్చింది. అయినా ఆయన అక్కడ ఉండటానికి వెళ్లలేదు. ఈదడానికే వెళ్లారు.
Kenichi Horie is due to set a record by becoming the world's oldest solo yachtsman to sail non-stop across the Pacific Ocean. https://t.co/gAsU21FDVG
— WFFT FOX 55 Fort Wayne (@FOX55FortWayne) June 4, 2022
1962లో మొదలైన అతని సముద్రయానం.. 1974, 1978, 1982, 2008 వరకు చేశాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత.. హోరీ శాన్‌ఫ్రాన్సిస్కోలోని యాచ్ హార్బర్ నుంచి మార్చి నెలలో సాహసయాత్రను ప్రారంభించాడు. ఈ యాత్రను జూన్ 4 శనివారం ఉదయం తెల్లవారుఝామున జపాన్‌లోని కిరు జలసంధికి చేరుకుని విజయవంతంగా ముగించాడు. దీంతో పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణించిన తొలి అత్యంత వీద్ధుడిగా కెనిచి హోరీ నిలిచాడు.