Iran Israeli Conflict: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో అమెరికా - అణుబాంబులు పేలితే అగ్ర రాజ్యానిదే బాధ్యత !
Israel: ఇజ్రాయెల్ తమ అణుస్థావరాలపై దాడులు చేస్తే.. భారీ దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. దీనికి అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

US responsible for any Israeli attack: తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ఇజ్రాయెల్ టెహ్రాన్‌పై దాడి చేస్తే 'వినాశకరమైన , నిర్ణయాత్మక ప్రతిస్పందన' ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.
ఇజ్రాయెల్ పై ఇటీవల ఇరాన్ దాడి
ఇరాన్‌లోని టెహ్రాన్‌లోని ఒక సైనిక స్థావరంలో వార్షిక ఆర్మీ డే వేడుకల సందర్భంగా ఇరాన్ మీడియం రేంజ్ క్షిపణులు 'నజీత్'ను ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌పై ఇటీవల జరిగిన దాడిని 'పరిమితం', 'శిక్షాత్మకం'గా ఇరాన్ చెబుతోంది. ఇరాన్‌పై ఏదైనా దురాక్రమణ చర్య జరిగితే 'శక్తివంతమైన , భయంకరమైన' ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC ) ప్రకటించారు. IRGC ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ వైపు డ్రోన్‌లు ,రాకెట్లను ప్రయోగించింది.
అణు ఒప్పందంపై చర్చలు జరుపుతున్న అమెరికా
రాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందనే ఆందోళన ఇజ్రాయెల్ వ్యక్తం చేస్ోతంది. US-ఇరాన్ చర్చలు విఫలమవడం లేదా కొత్త అణు ఒప్పందం ప్రాంతీయ ప్రత్యర్థిపై ఇజ్రాయెల్ దాడులను ప్రేరేపించవచ్చని దౌత్య నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ అణు ప్రదేశాలపై ఇజ్రాయెల్ దాడి జరిగితే అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు.ఇరాన్‌లో యురేనియం సుసంపన్నతపై తీవ్ర భిన్నాభిప్రాయాల ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ రెండింటికి సన్నిహిత మిత్రదేశమైన US ఐదవ రౌండ్ అణు చర్చలు జరపుదతున్నాయి. ఇది అణు బాంబులను అభివృద్ధి చేయడానికి దారితీస్తుందని వాషింగ్టన్ చెబుతోంది.
ఇజ్రాయెల్ దాడి చేస్తే గట్టి సమాధానం చెబుతామన్న ఇరాన్
"ఇజ్రాయెల్ ఏదైనా సాహసం చేస్తే జానితి వ్యతిరేకంగా ఇరాన్ గట్టిగా ప్రతి స్పందిస్తుంది. ఏదైనా బెదిరింపు లేదా చట్టవిరుద్ధమైన చర్యకు నిర్ణయాత్మకంగా స్పందిస్తుంది" అని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు రాసిన లేఖలో తెలిపారు. "ఇజ్రాయెల్ బెదిరింపుల కొనసాగింపుకు వ్యతిరేకంగా సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోవాలని నేను అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాను, " అని అరఘ్చి అన్నారు. "ఇరానియన్ అణు కేంద్రాలపై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సన్నాహాలు చేస్తోందని నిఘా సమాచారం ఉందని " ప్రచారం జరుగుతోంది.
🔴
— Anti_Kudeta 🍉 (@Looze_freedom) May 22, 2025
กระทรวงต่างประเทศอิหร่าน:
หากอิสราเอลกระทำการอย่างโง่เขลา พวกเขาจะเผชิญกับการตอบโต้ที่เลวร้ายในพื้นที่ทางภูมิศาสตร์อันเล็กของตน
เสถียรภาพจะไม่กลับคืนสู่โลกจนกว่าอิสราเอลจะถูกกำจัด#Iran #อิสราเอล pic.twitter.com/KufkUNLmsv
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్ యురేనియంను పెంచుకోవడాన్ని ఆపాలని అమెరికా డిమాండ్ చేయడం "మితిమీరినది ,దారుణమైనది" గా అభివర్ణించారు. ఖమేనీకి నేరుగా నివేదించే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), గురువారం కూడా ఇరాన్‌పై దాడి చేస్తే ఇజ్రాయెల్ "వినాశకరమైన , నిర్ణయాత్మక ప్రతిస్పందన" ఉటుందని హెచ్చరించింది.





















