Iran Israeli War : దెబ్బకొట్టిన ఇరాన్ - అత్యాధునిక ఫైటర్ జెట్స్ అన్నీ ఇజ్రాయెల్ కోల్పోయిందా ?
Missile Attack : ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయిల్ 30 ఫైటర్ జెట్స్ ను కోల్పోయినట్లుగా తెలుస్తోంది.
Iran Destroys 30 Israeli F-35 Fighter Jets in Massive Missile Attack : గాజాపై ఇప్పటి వరకూ వరుసగా దాడులు చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ కు ఇరాన్ ఒక్క సారిగా షాక్ ఇచ్చింది. రాత్రికి రాత్రి మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ లో ఎంత నష్టం జరిగిందన్నది పూర్తిగా బయటక రాలేదు కానీ ఇరాన్ పూర్తి వ్యూహంతో.. ఇజ్రాయెల్ సైన్యం ఆయువుపట్టుపై దెబ్బకొట్టేలా చేయడంలో కీలకమైన వ్యూహంతో వ్యవహరించిందని భావిస్తున్నారు. దీనికి కారణం ఇజ్రాయెల్ సైన్యానికి దాడులు చేయాడానికి ఎంతో ఉపయోపడే F - 15 ఫైటర్ జెట్స్ ను అత్యధికం ఇజ్రాయెల్ కోల్పోయిందని భావిస్తూండటమే.
ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు చేసిన ఇజ్రాయెల్ వెంటనే స్పందించలేకపోయింది. దీనికి కారణం ఏమిటో తెలియదు కానీ వార్ గ్రౌండ్ నుంచి కొన్ని కీలక అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇటవలి కాలంలో గాజా ప్రాంతంలో జరిపిన దాడులకు అత్యాధునిక F 35 పైటర్ జెట్స్ ను ఉపయోగించింది. వాటిని ఇరాన్ తన దాడుల్లో ధ్వంసం చేసింది . ఇజ్రాయిల్ ఎయిర్ బేస్ లో .. ఆ ఫైటర్ జెట్స్ ను టార్గెట్ గా చేసుకుని కురిపించిన బాంబుల వర్షంతో అవన్నీ ధ్వంసమయ్యాయని అంటున్నారు. ఈ కారణగా ఇరాన్ పై ప్రతిదాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఇంకా ఆలోచన చేస్తోందని చెబుతున్నారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం ఖాయమా? ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ చేసిన ప్రకటన ఉద్దేశం ఏంటీ?
హెజ్ బొల్లా పై ప్రతీకారం తీర్చుకునేందుకు లెబనాన్‌లో భూతల దాడులను ఇజ్రాయెల్ ప్రారంభిచిది. హెజ్ బొల్లాకు చెందిన సీనియర్ నాయకత్వం మొత్తాన్ని చంపేసింది. దీంతో ఇరాన్ క్షిపణుల ప్రయోగం మొదలు పెట్టడం పశ్చిమాసియాలో యుద్దమేఘాలు అలుముకున్నాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు పదుల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణుల్ని వాడినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగితే తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తము సైలెంట్ గా ఉండబోమని.. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ప్రతిఫలం అనుభవిస్తుందని ప్రకటించారు.
Prime Minister Netanyahu:
— Mossad Commentary (@MOSSADil) October 1, 2024
Iran made a big mistake tonight and it will pay for it pic.twitter.com/QPAnfHqDjL
ఇజ్రాయెల్ కు అండగా అమెరికా కూడా తెరపైకి వచ్చింది. ఇరాన్ క్షిపణుల్ని కూల్చేయాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తమ దళాలకు ఆదేశాలు జారీచేశారు. ఈ పోరు ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని తెలుస్తోంది. మొత్తంగా ఓ వైపు రష్యా, ఉక్రెయిన్ వార్ తోపాటు పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, ఇరాన్, పాలస్తీనా యుద్దంతో మూడో ప్రపంచ యుద్దం ప్రారంభమైనట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల్ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: పేజర్ పేలుడు నుంచి క్షిపణుల దాడి వరకు - ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 14 రోజుల్లో ఏం జరిగింది?