Iran attacks US: ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ప్రతీకార దాడులు, దోహా గగనతలం మూసివేత
Iran missiles hit the Al-Udeid base in Qatar | అమెరికా దాడుల అనంతరం ఖతార్ లోని అల్ ఉదెయిద్ ఎయిర్ బేస్ పై దాడి చేసినట్లు ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. దోహాలో పేలుళ్లతో ఎయిర్ బేస్ మూసేశారు.

టెహ్రాన్: ఇరాన్ ఖతార్‌లోని అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్‌లో ఉన్న అమెరికా సైనిక సిబ్బందిపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. తమ దేశంలోని 3 అణ స్థావరాలపై దాడి చేసిన అమెరికాపై సోమవారం రాత్రి ప్రతీకారం మొదలుపెట్టింది ఇరాన్. అమెరికా సైనిక స్థావరాలపై దాడి జరిపినట్లు ప్రకటనను దేశభక్తి గీతాలతో పాటు ఇరాన్ అధికారులు విడుదల చేశారు, దాడిని “అమెరికా దూకుడుకు ఇరాన్ బలగాల శక్తివంతమైన, విజయవంతమైన ప్రతిస్పందన” (The Blessing of Victory) అని వర్ణిస్తూ టెలివిజన్‌లో శీర్షికను ప్రదర్శించారు. అమెరికా వైమానిక కేంద్రాలపై మూడు మిస్సైల్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
దోహాలో పేలుళ్లు , గగనతలం మూసివేత
ప్రకటనకు కొద్దిసేపటి ముందు, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఖతార్ అకస్మాత్తుగా తన గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా చేసిన బెదిరింపుల తరువాత, ఖతార్ రాజధాని దోహాలో పేలుళ్లను విన్నట్లు ప్రత్యక్ష సాక్షి రాయిటర్స్‌కు తెలిపారు.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, న్యూస్ ఏజెన్సీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఇటీవలి పరిణామాలకు ప్రతిస్పందనగా ఇరాన్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ దాడులు ఒకటి. అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మరిన్ని దాడులు కొనసాగుతాయి. ఖతార్ అధికారులు “ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో సమన్వయంతో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇరాన్ అధికారిక ఛానెల్‌ల ద్వారా ప్రజలకు తాజా సమాచారాన్ని అందిస్తారు” అని పేర్కొన్నారు.
అమెరికా, యూకే ఎంబసీలు హెచ్చరికలు జారీ
ఖతార్‌లోని అమెరికా ఎంబసీ ఒక రోజు ముందు తన వెబ్‌సైట్‌లో హెచ్చరికను జారీ చేసింది. దేశంలోని అమెరికా పౌరులను “తదుపరి నోటీసు వచ్చే వరకు ఆశ్రయం పొందండి. అని సూచంచింది. కానీ మరింత వివరణ ఇవ్వలేదు. అసోసియేటెడ్ ప్రెస్ ఎంబసీ నుండి చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేదు. కొన్ని గంటల తరువాత, బ్రిటిష్ ఎంబసీ కూడా ఇదే విధంగా సలహాను జారీ చేసింది.
మాజీ అధ్యక్షుడు బైడెన్ పరిపాలనలోని ఒక సీనియర్ అధికారి అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, వైట్ హౌస్, పెంటగాన్ రెండూ అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్‌కు ముప్పు గురించి తెలుసునన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడలేకపోతున్నానని పేర్కొంటూ తన పేరును వెల్లడించడానికి ఆ అధికారి నిరాకరించారు.
భారత ఎంబసీ హెచ్చరికలు
ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖతార్‌లోని భారత ఎంబసీ భారతీయులను “జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని” కోరుతూ ఒక సలహా జారీ చేసింది. “దయచేసి ప్రశాంతంగా ఉండండి, స్థానిక వార్తలు, సూచనలు గమనిస్తూ.. ఖతార్ అధికారుల మార్గదర్శకాలను పాటించండి. ఎంబసీ కూడా మా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా అప్‌డేట్ చేస్తుంది.” అని సూచించారు.
ఇరాన్ నుండి నేరుగా పర్షియన్ గల్ఫ్ అవతల ఉన్న ఖతార్, US మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఫార్వర్డ్ హెడ్‌క్వార్టర్స్ అయిన అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్‌ను కలిగి ఉంది. గల్ఫ్ దేశం ఇరాన్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తుంది. ఆ దేశంతో భారీ ఆఫ్‌షోర్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్‌ను పంచుకుంటోంది. టెహ్రాన్ నుండి అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఉన్నప్పటికీ, ఇటీవల అమెరికా సైనిక దాడుల తర్వాత తాజాగా ఇరాన్ అన్నంత పని చేసింది.






















