250 కిలోల వెయిట్ లిఫ్టింగ్, అదుపు తప్పి మెడపై పడిన బార్బెల్ - బాడీబిల్డర్ మృతి
Indonesia Bodybuilder: వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా బార్బెల్ మెడపై పడి ఇండోనేషియా బాడీ బిల్డర్ ప్రాణాలు కోల్పోయాడు.
Indonesia Bodybuilder:
ఇండోనేషియా బాడీ బిల్డర్ మృతి
ఫిట్‌నెస్ కోసం అవసరానికి మించి వ్యాయామం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. జిమ్‌లోనే ఎక్స్‌ర్‌సైజ్ చేస్తూ హార్ట్‌అటాక్‌తో చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇండోనేషియాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 33 ఏళ్ల జస్టిన్ విక్కీ (Justyn Vicky) ఫేమస్ బాడీ బిల్డర్. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే...జులై 15న జిమ్‌లో రోజూలాగే వ్యాయామం చేస్తున్నాడు. మెడపై 450 పౌండ్లకు మించిన బరువుని మోసేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి అది అదుపు తప్పింది. అంత బరువు ఒకేసారి పడడం వల్ల మెడ విరిగిపోయింది. స్క్వాట్స్ చేస్తుండగా వీడియో కూడా తీశారు. ఆ వెయిట్ అంతా మెడపై పడి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. సర్జరీ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఫిట్‌నెస్ విషయంలో చాలా మంది స్ఫూర్తిగా నిలిచిన జస్టిన్ విక్కీ ఇలా ప్రాణాలుకోల్పోవడం సంచలనం కలిగించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న జస్టిన్ చాలా మందిని ప్రోత్సహించేవాడట. ఆయన చనిపోయాడని తెలిసినప్పటి నుంచి చాలా మంది తీవ్ర ఆవేదనతో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆయన కేవలం ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ మాత్రమే కాదని, అంతకు మించి గొప్ప వ్యక్తి అని ట్వీట్‌లు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జస్టిన్‌కి 30వేల ఫాలోవర్స్ ఉన్నారు. న్యూట్రిషన్, వెయిట్ లాస్ కోచ్‌గా పాపులర్ అయ్యాడు. గత వారమే ఐస్ బాత్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది. జస్టిన్ నవ్వుని ఎప్పటికీ మరిచిపోలేమని స్నేహితులు చాలా ఎమోషనల్ అవుతున్నారు.
Bodybuilder Justyn Vicky dead at 33 after 400-pound weight breaks neck 🥹🥹 Full Video pic.twitter.com/4NAM2JWHxz
— Sweet❤️ (@Sweetbobo01) July 22, 2023
ఢిల్లీలోనూ ఇదే తరహా ఘటన..
ఢిల్లీలోని ఓ యువకుడు జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చనిపోయాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో మరోసారి భయాందోళనలు రేకెత్తుతున్నాయి. రోహిణి ప్రాంతంలోని సెక్టార్ 19 లో ఈ ఘటన వెలుగుచూసింది. స్థానికంగా నివసించే 24 ఏళ్ల సాక్షం పృథ్వీ అనే యువకుడు గురుగ్రామ్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవలె బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. దగ్గర్లోని సెక్టార్ 15లో ఉన్న జిమ్ ఫ్లెక్స్ ఫిట్‌నెస్ జోన్ జిమ్ లో సాక్షం పృథ్వీ చేరాడు. ఫిట్‌నెస్ కోసం, మంచి ఆరోగ్యం కోసం రోజూ కసరత్తులు చేసేవాడు. ఎప్పట్లాగే జిమ్ కు వెళ్లాడు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన జిమ్ సిబ్బంది, తోటి వారు సాక్షం పృథ్వీని హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పృథ్వీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. పృథ్వీ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించగా.. షాకింగ్ విషయం బయటపడింది. ట్రెడ్మిల్ పై రన్నింగ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ కారణంగానే సాక్షం పృథ్వీ కుప్పకూలిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. జిమ్ మేనేజర్ అనుభవన్ దుగ్గల్ ను అరెస్టు చేశారు. సాక్షం పృథ్వీ మరణం పై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Also Read: లండన్‌లో కళ్లు చెదిరే మ్యాన్షన్‌ని కొన్న ఇండియన్ బిలియనీర్, ధర రూ.1,200 కోట్లు