Pakistan Warns India: యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్‌ను పాతిపెడతాం: పాకిస్తాన్ రక్షణ మంత్రి
Operation Sindoor | పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖాజా ఆసిఫ్ భారత్ పై బెదిరింపులకు దిగారు. మరోసారి యుద్ధానికి వస్తే భారత్‌ను యుద్ధ విమానాల శిథిలాల కింద పాతిపెడతామని హెచ్చరించారు.

India vs Pakistan | ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం సరిహద్దులు దాటింది. ఇటీవల భారత ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు పాక్ తీవ్రంగా స్పందించింది. భారతదేశాన్ని దాని యుద్ధ విమానాల శిథిలాల కింద పాతిపెట్టేస్తామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత సైనిక, రాజకీయ ప్రకటనలను ఆయన provoking అని పేర్కొన్నారు. ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్, ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పాక్ లో మంట పెట్టాయి.
ప్రజల్లో నమ్మకం పెంచడానికి అంటూ ఎదురుదాడి
భారత ప్రభుత్వం, నేతలు కోల్పోయిన విశ్వసనీయతను తిరిగి పొందడానికి చేసిన విఫల ప్రయత్నంలో దూకుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పాక్ మంత్రి ఆసిఫ్ ఖాజా వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న సవాళ్ల నుండి పౌరులను పక్కదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలను పెంచుతోందని ఆయన ఆరోపించారు. “పాకిస్తాన్ అల్లా పేరుతో నిర్మితమైనన రాజ్యం, మా రక్షకులు అల్లాహ్ సైనికులు. ఈసారి భారతదేశం, ఇన్షా అల్లా.. దాని విమానాల శిథిలాల కింద పాతిపెట్టేస్తాం. అల్లాహు అక్బర్” అని ఆసిఫ్ తన పోస్ట్ లో రాశారు.
ఆపరేషన్ సిందూర్
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతోంది. మే 7న భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ తో ఈ మాటల యుద్ధం పెరిగింది. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. పీఓకే, పాక్ లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు నేటమట్టం చేశాయి. ఆపరేషన్ సిందూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాం. భారతదేశం పలు పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలను కూల్చివేసింది. పాక్ లోని సైనిక వైమానిక స్థావరాలకు నష్టం వాటిల్లినట్లు శాటిలైజ్ ఫొటోలు కూడా నిర్ధారించాయి. ఇంత భారీగా నష్టపోయినా పదేపదే తాము విజయం సాధించినట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. ఆధారాలు అడిగితే మాత్రం పాక్ తోక ముడుస్తోంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై పాక్ దూకుడుగా ప్రకటనలు చేస్తూనే ఉంది.
భారతీయ ఇంటెలిజెన్స్ ఎదరుదాడి
భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఆసిఫ్ వ్యాఖ్యలను “బాధ్యతారాహిత్యమైనవి, తీవ్రవాదపూరితమైనవి” అని కొట్టిపారేశారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక పతనంతో పాకిస్తాన్ నేతల నిరాశను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. “ఈ ప్రకటనలు పాక్ అంతర్గత అస్థిరత, అంతర్జాతీయ వారి ఒంటరితనం నుండి దృష్టి మరల్చాలనే ఉద్దేశాన్ని ప్రదర్శిస్తున్నాయి” అని వర్గాలు తెలిపాయి. భారత్ విశ్వసనీయత మాటల్లో కాదు, చర్యల్లో ఉందని పేర్కొంది. పాకిస్తాన్ లాగా కాకుండా, భారత సాయుధ దళాలు సంయమనంతో, ఖచ్చితత్వంతో పనిచేస్తున్నాయని ఇంటెలిజెన్స్ చెప్పింది. పాక్ చెప్పేవి బూటకపు మాటలు, ప్రచారం చేస్తుంది కానీ చేతల్లో కాదంది.
భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిక
ఉద్రిక్తతలు కొనసాగుతుండగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది రెండు రోజుల కిందట పాక్ ను తీవ్రంగా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉన్నట్లు ఇప్పుడు సంయమనం పాటించబోమని హెచ్చరించారు. “పాకిస్తాన్ భూగోళంలో ఉండాలనుకుంటే, అది ఉగ్రవాదాన్ని ఆపాలి” అని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఆపరేషన్ సిందూర్ తో జరిగే నష్టాన్ని పాక్ ఊహించడం కష్టమేనన్నారు.
'మనోహర్ కహానియాన్'
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మే నెలలో 4 రోజుల పాటు జరిగిన ఘర్షణలో భారత వైమానిక దళం F-16లు, JF-17లతో సహా 8 నుండి 9 అధునాతన పాకిస్తానీ యుద్ధ విమానాలను కూల్చివేసిందన్నారు. పాకిస్తాన్ 15 భారత విమానాలను కూల్చివేసిందని చెబితే.. అలాగే అనుకోనివ్వండి. మేం ఏం చేయగలిగామో ప్రపంచానికి అన్ని ఆధారాలను చూపించాం, కాని వారు ఏదైనా చేసింటే.. వారు ఎందుకు ప్రదర్శించలేకపోయారు? అని ప్రశ్నించారు.
పాకిస్తాన్ భారతీయ విమానాలను కూల్చివేసినట్లు చేసిన ప్రకటనలను ఆయన “మనోహర్ కహానియాన్” (ఆసక్తికరమైన కథలు) అని అభివర్ణించారు. భారత్ పలు పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా దాడి చేసిందని, యూఎస్ చేసిన F-16లు, చైనా చేసిన JF-17లు, ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (AEW&C) వ్యవస్థతో సహా కనీసం 5 హై-టెక్ జెట్‌లను ధ్వంసం చేసిందని ఎయిర్ మార్షల్ సింగ్ తెలిపారు.






















