Operation Sindoor 2.0: ఈసారి వదిలిపెట్టం, పాక్‌ను మ్యాప్‌లో లేకుండా చేస్తాం... భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్
Army Chief General Upendra Dwivedi | భారత ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేశారు. ఈసారి భారత సైన్యం సహనం పాటించదని, మ్యాప్‌లో లేకుండా చేస్తుందని జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.

భారత ఆర్మీ చీఫ్, జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్ లోని అనూప్‌గఢ్ లోని ఆర్మీ పోస్ట్‌ను, శ్రీ గంగానగర్‌లోని ఘడ్సానా గ్రామంలోని 22 MDలో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్మీ, BSF అధికారులతో సమావేశమై ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న సన్నద్ధతను సమీక్షించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే, పాకిస్తాన్ అనేది మ్యాప్ నుండి తుడిచిపెట్టుకుపోవచ్చు అని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి భారత సైన్యం గతంలోలా ఓపిక పట్టదని ఆయన అన్నారు.
త్వరలో ఆపరేషన్ 2.0
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం ఆపకపోతే, 'ఆపరేషన్ సింధూర్' 2.0 త్వరలో ప్రారంభించవచ్చు. 'బ్రతికి ఉన్నంత కాలం ఆపరేషన్ సింధూర్ గుర్తుండిపోతుంది' అన్నారు. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. ఈ ఆపరేషన్ ఆధారాలను ప్రపంచానికి కూడా చూపించాం అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం సైనికులు, స్థానికులకు దక్కుతుందన్నారు.
ఈసారి భారత్ అంత ఓపికగా ఉండదు..
ఆపరేషన్ సింధూర్ మన జీవితాలతో ముడిపడి ఉందని, మనం ఉన్నంత కాలం ఇది గుర్తుకు ఉంటుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేరు పెట్టారని, ఇది మహిళలకు అంకితం చేయబడిందని అన్నారు. ఈసారి భారతదేశం పూర్తి సన్నద్ధతతో ఉందనని, పరేషన్ సింధూర్ 2.0లో భారతదేశం ఆపరేషన్ సింధూర్ 1.0లో చూపించిన ఓపికను ప్రదర్శించదు. ఈసారి భారతదేశం అలాంటి చర్యలు తీసుకుంటుందందే.. పాకిస్తాన్ అనేది చరిత్రలో మ్యాప్2లో ఉంటుందా లేదా అని ఆలోచించాల్సి వస్తుంది. పాకిస్తాన్ భూమిపై తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే, ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న ఉపేంద్ర ద్వివేది.. ఆపరేషన్ సింధూర్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు సర్వీస్ అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో BSF 140వ బెటాలియన్ కమాండెంట్ ప్రభాకర్ సింగ్, రాజ్‌పుతానా రైఫిల్స్ మేజర్ రితేష్ కుమార్, హవల్దార్ మోహిత్ గైరాను ఆర్మీ చీఫ్ సత్కరించారు.
VIDEO | Anupgarh, Rajasthan: Indian Army Chief General Upendra Dwivedi says, "This time we will not maintain the restraint that we did in Operation Sindoor 1.0... this time we will do something that Pakistan will have to think whether it wants to be in Geography or not. If… pic.twitter.com/YXoHUL7xKv
— Press Trust of India (@PTI_News) October 3, 2025
మహిళ నుదుటిపై సింధూరం ఆపరేషన్ సిందూర్ గుర్తుకుతెస్తుంది..
ఆపరేషన్ సింధూర్ విజయంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారత సైన్యంతో పాటు సామాన్య ప్రజలకు కూడా విజయాన్ని ఆపాదించారని ఆర్మీ చీఫ్ అన్నారు. దేశంలోని ఏ మహిళ నుదుటిపై సింధూరం పెట్టుకున్నా, ఆపరేషన్ సింధూర్‌లో కీలక పాత్ర పోషించిన భారత సైనికులను గుర్తు చేసుకుంటుంది. ఈసారి ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. మొత్తం ఆపరేషన్‌కు ఒకే పేరు పెట్టారు, అయితే ఇంతకు ముందు చేసిన ఆపరేషన్‌లకు వేర్వేరు పేర్లు ఉండేవి. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, భారతదేశం ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి ఉగ్రవాదుల 9 స్థావరాలు ధ్వంసం చేసింది, వీటిలో 7 ఆర్మీ ద్వారా, 2 వైమానిక దళం ద్వారా ఆపరేట్ చేశారు. ప్రపంచమంతా భారతదేశంతో కలిసి వచ్చిందని ఆర్మీ చీఫ్ అన్నారు. ఈ ఉగ్రవాద దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు.
ఆధారాలు చూపించకపోతే పాక్ వాటిని కొట్టిపారేసేది..
ఆపరేషన్ సింధూర్ లో ఏ ఒక్క అమాయకుడిని చంపకూడదని, సైనిక లక్ష్యాలను కూడా నాశనం చేయకూడదని భారత్ నిర్ణయించింది. మా లక్ష్యం ఉగ్రవాద స్థావరాలు, వారి శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదులను నిర్మూలించడమే. పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఆధారాలను కూడా భారతదేశం ప్రపంచానికి చూపించిందని అన్నారు. భారతదేశం ఆధారాలు చూపించకపోతే, పాకిస్తాన్ వాటన్నింటినీ దాచిపెట్టేది. ఈసారి భారతదేశం పూర్తి సన్నద్ధతతో ఉందన్నారు. పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ, ఆపరేషన్ సింధూర్ 1.0లో భారతదేశం ఓపిక పట్టగా, ఈసారి భారతదేశం ఆ ఓపికను పాటించదన్నారు.
#GeneralUpendraDwivedi, #COAS, visited #Bikaner Military Station to review the operational preparedness of the formation. During the visit, he was briefed on operational matters, technology infusion, integration with other security agencies and various nation-building initiatives… pic.twitter.com/g1BNu5XuGl
— ADG PI - INDIAN ARMY (@adgpi) October 3, 2025
ఆపరేషన్ సిందూర్ లో 5 పాక్ ఫైటర్ జెట్‌లు కూల్చివేశాం: IAF చీఫ్
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు జరిగిన నష్టాలపై భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ స్పందించారు. భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. ఐఏఎఫ్, భారత ఆర్మీ కలిసి పాకిస్తాన్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంపులపై భారీ దాడి చేసి, వారికి తీవ్ర నష్టం కలిగించాం. భారత్ చేసిన దాడుల కారణంగా కనీసం నాలుగు చోట్ల రాడార్లు, రెండు చోట్ల కమాండ్, కంట్రోల్ కేంద్రాలు, రెండు చోట్ల రన్‌వేలు దెబ్బతిన్నాయి. మరో మూడు వేర్వేరు ఎయిర్ బేస్ స్టేషన్లలో మూడు హ్యాంగర్లు దెబ్బతిన్నాయి.
మాకు ఒక C-130 తరగతి విమానం సిగ్నల్స్ వచ్చాయి. పాకిస్తాన్ కు కనీసం 4 నుండి 5 యుద్ధ విమానాలు నష్టం వాటిల్లింది. చాలావరకు F-16తో పాటు ఒక SAM వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. వాయు రక్షణ భాగానికి సంబంధించినంతవరకు, ఒక లాంగ్-రేంజ్ స్ట్రైక్ గురించి ఐఏఎఫ్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నేను 300 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ వరకు వెళ్లి చేసిన దాడుల గురించి చెబుతున్నారు. ఇది AEW&C లేదా SIGINT విమానం, ఆపై F-16..JF-17 క్లాస్ పాక్ ఫైటర్ జెట్స్ కూల్చివేశాం’ అని ఐఏఎఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గురువారం నాడు తెలిపారు.






















