India-UAE relationship: 'భారత్- యూఏఈది బలమైన బంధం- భవిష్యత్‌లో ప్రపంచాన్నే మారుస్తాం'
India-UAE relationship: భారత్- యూఏఈ మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు.
India-UAE relationship: ప్రపంచ వాతావరణ పరిరక్షణలో భాగంగా యూఏఈ వేదికగా నిర్వహించిన ఐజీఎఫ్ యూఏఈ (గ్లోబల్ ఫోరం)-2022లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పొల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు, గ్లోబల్ వార్మింగ్ కట్టడికి యూఏఈతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ జై శంకర్.. కొన్ని అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా ప్రపంచీకరణ.. ప్రపంచ దేశాలపై దాని ప్రభావం గురించి వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో యూఏఈ- భారత్ బంధం సరికొత్త స్థాయికి చేరుకుంటుందని, ప్రపంచాన్నే మార్చే స్థాయికి వెళుతుందని జై శంకర్ అన్నారు.
Spoke at India Global Forum in Abu Dhabi this morning.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) December 12, 2022
Brought out the relationship between globalization, rebalancing &multi-polarity.But underlined that more perennial competitive forces are also at work.Far from witnessing an end of history,we are seeing a return of history. pic.twitter.com/Oj9LRpi5Gw
ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, నాయకత్వం, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ చర్చలో ప్యానెలిస్ట్‌లు.. భారత్ G20 ప్రెసిడెన్సీ, COP 28కు UAE ఆతిథ్యం, భౌగోళిక రాజకీయాలను మార్పు, ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై వాటి ప్రభావం, వాతావరణ మార్పు వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ భాగస్వాముల సహకారం వంటి విషయాలను లేవనెత్తారు.