News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Imran khan praises India's foreign policy: 'చైనాతో దోస్తీనే నా కొంప ముంచింది- కానీ భారత్ అలా కాదు'

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్నేహం వల్లే తన పదవి పోయిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

FOLLOW US: 
Share:

చైనాతో దోస్తీ కారణంగానే తన పదవి పోయిందని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూశానని, అయితే స్వదేశ ప్రయోజనాలు గిట్టని ప్రతిపక్షాలు తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర పన్నాయని ఇమ్రాన్ అన్నారు.

ఇదేంటి ఇలా

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి చైనాతో సన్నిహితంగా ఉన్న ఇమ్రాన్ ఒక్కసారిగా తన పదవి కోల్పోవడానికి డ్రాగన్ దేశమే కారణమని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఇదే సమయంలో భారత విదేశాంగ విధానాలపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు.

" భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుంది. కానీ, పాక్‌లో అలాంటి పరిస్థితులు లేకపోవడం వల్లే ప్రస్తుత సంక్షోభం నడుస్తోంది. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి, అయినా రష్యా నుంచి చమురు తీసుకుంటోంది. చమురు కొనుగోలు చేయవద్దంటూ భారత్‌కు అమెరికా సూచించినప్పుడు తమ దేశానికి ఏది మంచో ఆ కోణంలోనే నిర్ణయం తీసుకుంటామని సూటిగా చెప్పేసింది. భారత్‌ విదేశాంగ విధానం అనేది తన సొంత ప్రజల కోసం.                                                                     "
- ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని 

పాక్ అలా కాదు 

అయితే పాక్ విదేశాంగ విధానం ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలని కొందరు కోరుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చైనాతో స్నేహాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు ఇష్టపడ లేదన్నారు. అప్పుడే కుట్ర మొదలైందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.

రష్యా పర్యటన 

ఇక ప్రధాని హోదాలో తాను రష్యా పర్యటన చేయడం విదేశీ శక్తులకు నచ్చలేదన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆ పర్యటనను సమర్థించుకున్నారు. తాను రష్యాకు వెళ్లింది 30 శాతం డిస్కౌంట్‌తో చమురు కొనుగోలుకేనని, పాక్‌ ద్రవ్యోల్బణం నియంత్రణకే తాను ప్రయత్నించానన్నారు. 

Also Read: UK PM Boris Johnson India Visit: బ్రిటన్ ప్రధానితో హైదరాబాద్ హౌస్‌లో మోదీ భేటీ- ఉక్రెయిన్, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చ

Also Read: Karnataka: యువకుడ్ని చెంప దెబ్బ కొట్టిన ఎమ్మెల్యే- ఎందుకో తెలుసా?

Published at : 22 Apr 2022 08:57 PM (IST) Tags: Imran Khan Imran Khan News Imran Khan praises India's foreign policy

ఇవి కూడా చూడండి

ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్‌ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం

ఏవియేషన్ చరిత్రలోనే అరుదైన రికార్డు, సస్టైనబుల్ ఏవియేషన్‌ ఫ్యుయెల్‌తో దూసుకెళ్లిన తొలి విమానం

Gaza: ఇజ్రాయేల్‌ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?

Gaza: ఇజ్రాయేల్‌ హమాస్ మధ్య మరో డీల్! మరికొంత మంది బందీల విడుదలకు చర్చలు?

Gaza: ఓసారి గాజాకి రండి, ఇజ్రాయేల్‌ ఎంత నాశనం చేసిందో తెలుస్తుంది - మస్క్‌కి హమాస్‌ కౌంటర్

Gaza: ఓసారి గాజాకి రండి, ఇజ్రాయేల్‌ ఎంత నాశనం చేసిందో తెలుస్తుంది - మస్క్‌కి హమాస్‌ కౌంటర్

US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్‌న్యూస్

US H-1B Visa: ఇకపై అమెరికాలోనే H-1B వీసాల రెన్యువల్, భారతీయులకు గుడ్‌న్యూస్

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం

టాప్ స్టోరీస్

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Telangana Elections 2023: మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం, ఓటర్లు నిలదీయడంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు!

Telangana Elections 2023: మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం, ఓటర్లు నిలదీయడంతో పోలింగ్ బూత్ నుంచి బయటకు!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Fact Check: ఆలియా భట్ డీప్‌ఫేక్ వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే

Fact Check: ఆలియా భట్ డీప్‌ఫేక్  వీడియో - ఫస్ట్ పోస్ట్ ఇండోనేషియాలో, వాస్తవాలు ఇవే