Nobel Prize For Literature 2025:హంగేరియన్ రచయిత లాస్జ్లో క్రాస్జ్నాహోర్కైకు సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటన
Nobel Prize For Literature 2025: సాహిత్యంలో నోబెల్ అవార్డును ప్రకటిస్తూ స్వీడిష్ అకాడమీ, ప్రపంచంలో విధ్వంసం, భయం ఉన్నప్పటికీ లాస్లో క్రాస్జ్నాహోర్కై రచనల శక్తిని చూపుతున్నాయని పేర్కొంది.

Nobel Prize For Literature 2025: స్వీడిష్ అకాడమీ గురువారం (అక్టోబర్ 9, 2025) సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఈ అవార్డులను సాయంత్రం 4:30 గంటలకు ప్రకటించారు. ఈ సంవత్సరం, హంగేరీకి చెందిన లాస్జ్లో క్రాస్జ్నాహోర్కైకి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ అవార్డును అత్యుత్తమ పుస్తకాలు, కవితలు రాయడం ద్వారా సాహిత్యానికి గణనీయమైన కృషి చేసిన రచయితలకు ఇస్తారు.
'లాస్జ్లో రచనలు దార్శనికమైనవి'
ఈ అవార్డును ప్రకటిస్తూ స్వీడిష్ అకాడమీ,"లాస్జ్లో క్రాస్జ్నాహోర్కై రచనలు చాలా ప్రభావవంతమైనవి. దార్శనికమైనవి. మనం నివసించే ప్రపంచంలో వినాశనం, భయం మధ్య కూడా అవి రచనా శక్తిని ప్రదర్శిస్తాయి. లాస్జ్లో మధ్య యూరోపియన్ సంప్రదాయంలో గుర్తింపు పొందిన రచయిత, కాఫ్కా నుంచి థామస్ బెర్న్‌హార్డ్ వరకు గుర్తింపు పొందారు."
లాస్జ్లో మొదటి నవల, సటాంటాంగో, 1985లో ప్రచురితమైంది. హంగేరీలో రచయితగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నవల కమ్యూనిజం పతనానికి ముందు హంగేరియన్ గ్రామీణ ప్రాంతంలోని బంజరు భూముల్లో నివసించే నిరుపేదల బతుకు చిత్రాల గురించి వివరించింది.
Also Read: ఫిజిక్స్‌లో ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు నోబెల్ - సర్క్యూట్లలో 'టన్నెలింగ్' రహస్యాన్ని ఛేదించినందుకు పురస్కారం
లాస్జ్లో పుస్తకాల ఆధారంగా అనేక సినిమాలు
లాస్జ్లో పుస్తకాలు తాత్వికమైనవని కమిటీ పేర్కొంది. అవి మానవత్వం, అరాచకం, ఆధునిక సమాజంలోని సంక్షోభాలను నిష్కపటంగా ప్రస్తావిస్తాయి. మొత్తంమీద, లాస్జ్లో లోతైన ఆలోచనాత్మక, విచారకరమైన కథలను రాయడానికి ప్రసిద్ధి చెందారు. అతని పుస్తకాలు, "సాటాంటాంగో" "ది మెలాంచోలీ ఆఫ్ రెసిస్టెన్స్" కూడా సినిమాలుగా మార్చారు.
"ది మెలాంచోలీ ఆఫ్ రెసిస్టెన్స్" ఒక చిన్న గ్రామం, దాని ప్రజల కష్టతరమైన జీవితాల చుట్టూ తిరుగుతుంది, మానవ స్వభావం లోపాలు, సద్గుణాలను సంపూర్ణంగా చిత్రీకరిస్తుంది. "సాటాంచోలీ ఆఫ్ రెసిస్టెన్స్" ఏడు గంటల చిత్రంగా మార్చచారు, ఇది చాలా ప్రశంసలు అందుకుంది.
విజేత 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్ (రూ. 10.3 కోట్లు), బంగారు పతకం, సర్టిఫికేట్ అందుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ మంది విజేతలు గెలిస్తే, బహుమతి డబ్బు వారి మధ్య విభజిస్తారు. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో అవార్డులను ప్రదానం చేస్తారు. నోబెల్ అకాడమీ ఇప్పటివరకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యానికి బహుమతులు ప్రకటించింది.





















