కెనడాలోని హిందువుల్లో భయం నెలకొంది, ట్రూడో పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు
భారత సంతతి వ్యక్తి, కెనడాలోని అధికార లిబరల్ పార్టీ సభ్యుడు చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడాలోని హిందువుల్లో భయం నెలకొందన్నారు.
![కెనడాలోని హిందువుల్లో భయం నెలకొంది, ట్రూడో పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు govt responsible for rising Khalistani extremism, says Trudeau’s party MP Chandra Arya కెనడాలోని హిందువుల్లో భయం నెలకొంది, ట్రూడో పార్టీ ఎంపీ చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/25/8d367203424473f3b14c957cf65e54c91695585959925840_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత సంతతి వ్యక్తి, కెనడాలోని అధికార లిబరల్ పార్టీ సభ్యుడు చంద్ర ఆర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదులు చేసిన బెదిరింపులతో కెనడాలోని హిందువుల్లో భయం నెలకొందన్నారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలపై చర్యలు తీసుకోకపోవడానికి, తమ పార్టీదే బాధ్యతని చంద్ర ఆర్య స్పష్టం చేశారు. ప్రధాని జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఆయన.. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హిందూ కెనడియన్లు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి ట్రూడో ప్రకటన తర్వాత ఏం జరుగుతుందో ఆందోళన ఉందన్నారు ఎంపీచంద్ర ఆర్య. కెనాడలో హిందూ కెనడియన్ల భద్రతపై ఆందోళనగా ఉందన్న ఆయన, హిందూ కెనడియన్లు ఎంతో భయంతో కాలం గడపుతున్నారని తెలిపారు.
హిందూ కెనడియన్లలో భయానికి మూడు కారణాలను విశ్లేషించారు. ఖలిస్థాన్ ఉద్యమం అనేది హింస, హత్యలతో కూడుకున్నదని, 38ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా బాంబు దాడి ఘటన చరిత్రలోనే అతిపెద్ద సామూహిక హత్యను కెనడియన్లు మరచిపోయారని అన్నారు. ఇందిరా గాంధీ కట్‌ఔట్‌ను ఊరేగించడాన్ని తప్పుపట్టిన ఆయన, ఇలాంటి భావప్రకటనా స్వేచ్ఛను ఏ దేశం అంగీకరిస్తుందని ప్రశ్నించారు. హిందూ కెనడియన్లు కెనడా వీడి పోవాలంటూ గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సరైన నిర్ణయం కాదని చంద్ర ఆర్య స్పష్టం చేశారు. కొందరు తీవ్రవాద భావజాలం ఉన్నవారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నా, ఎంతో మంది సిఖ్-కెనడియన్లు మాత్రం ఖలిస్థాన్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదన్నారు. వారంతా హిందూ కెనడియన్లతోనే మమేకమయ్యారని వెల్లడించారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన సమాచారం అమెరికా నుంచే కెనడాకు అందినట్లు సమాచారం. ఆ తర్వాత కెనడా ఈ ఇంటెలిజెన్స్‌కు అదనపు సమాచారం సమకూర్చుకొన్నట్లు అంతర్జాతీయ పత్రికలు వెల్లడించాయి. భారత దౌత్యవేత్త కమ్యూనికేషన్లలోకి చొరబడి సేకరించిన సమాచారం కచ్చితమైన ఆధారంగా మారిందని, దీంతో భారత్ ఈ దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఫైవ్‌ఐస్ గ్రూప్‌లో సభ్యదేశమైన కెనడాతో సాధారణంగానే అమెరికా ఎక్కువగా ఇంటెలిజెన్స్‌ను పంచుకొంటుంది. ఇందులో ఇంటర్‌సెప్టెడ్ కాల్స్, ఇతర మార్గాల్లో సేకరించిన సమాచారం ఉంటుంది. వీటిల్లో అమెరికా ఉద్దేశపూర్వకంగానే నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా చొప్పించి కెనడాకు అందజేసింది.
ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యను భారత్‌పై రుద్దాలని కెనడా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సైడ్‌లైన్స్‌లో ఇటీవల జీ7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు జపాన్ అధ్యక్షత వహిస్తోంది. ఐక్య రాజ్యసమితిలో భారత్‌పై ప్రకటన ఇప్పించడంలో కెనడా విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రష్యా, చైనా, ఇండో-పసిఫిక్, ఉత్తర కొరియా, నైగర్ అంశాలపై మాత్రమే స్పందించింది. భారత్ విషయంపై నోరు మెదపలేదు. ఇక్కడి సంయుక్త ప్రకటనలో ఉగ్రవాది నిజ్జర్ హత్య అంశాన్ని ఖండించే విషయాన్ని చేర్చాలని కెనడా చేసిన లాబీయింగ్ విఫలమైంది. జీ7లోని కీలక దేశాలు కెనడా అభ్యర్థనకు బ్రేకులేశాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)