
Carrying Lion : ఓ యువతి.. చంకలో సింహం ! ఈ రియల్ సీన్ చూస్తారా ?
స్కూలుకెళ్లనని మారాం చేసే పిల్లాడిని ఎత్తుకుని స్కూల్‌కు తీసుకెళ్తున్నట్లుగా ఓ మహిళ సింహాన్ని ఎత్తుకునితీసుకెళ్తోంది. కువైట్‌లో జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది.

సింహాన్ని చూస్తేనే భయంతో వణికిపోతాం. ఇక టచ్ చేయడం కూడానా. దూరంగా ఉండి ఎప్పుడైనా జూకు వెళ్తే దూరంగా నిలబడి కెమెరా ట్రిక్ తో దగ్గరగా ఉన్నట్లుగా ఫోటోలు ఎడిట్ చేసుకుని సంతోషపడతాం. కానీ ఓ సింహాన్ని ఎత్తుకుని వెళ్లడం... అదీ కూడా పిల్లల్నితీసుకెళ్తున్నట్లుగా తీసుకెళ్లడం ఎప్పుడూ చూసి ఉండటం. ఇలాంటి దృశ్యం కనిపిస్తే.. దాన్ని కెమెరాలో బంధిస్తే వైరల్ కాకుండా ఉంటుందా..? ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆ వీడియో కింద చూడండి.
My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY
— Arlong (@ramseyboltin) January 3, 2022
Also Read: అరె ఏంట్రా ఇది.. పప్పీలతో పడుకుంటే 10 లక్షల లైక్‌లా.. గిన్నిస్ రికార్డ్ కూడా!
ఈ వీడియో కువైట్‌లో తీశారు. రాత్రి పూట మహిళ సింహాన్ని పట్టుకుని తీసుకెళ్తోంది. అదేమో తాను రానని మొండికేస్తున్నట్లుగా కాళ్లు .. చేతులు ఆడిస్తోంది. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: లోయ అంచులో ఉయ్యాల జంపాల ఆట.. ఇతను జస్ట్ మిస్! ఒళ్లు గగుర్పొడిచే వీడియో
కువైట్‌లో సింహాలు..పులులను పెంచుకోవడం కామనే. కానీ చట్టం మాత్రం అనుమతించదు. ఎంతయినా అవి క్రూర మృగాలు కాబట్టి వాటితో ఉండాల్సిన విధంగా ఉండాలి. వాటిని దూరంగానే ఉంచుతారు. కానీ కొంత మంది మాత్రం వాటితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. మనుషులే కాదు.. అవి కూడా కనెక్ట్ అయిపోతాయి. అయినప్పుడు ... వారి మధ్య ఏర్పడే బాండింగ్‌లో భయం అనేది ఉండదు. ఈ వీడియోలో అదే కనిపిస్తోంది.
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఆ సింహం ఎక్కడికో వెళ్లింది. తిరిగి రాలేదు. రమ్మంటే రావడం లేదు. అందుకే ఎత్తుకుని ఆమె ఇంటికి తీసుకెళ్లిపోతోంది. అదేమో నేను రాను అని మొండికేస్తున్నట్లుగా ఉంది. చాలా మంది అది నిజంగా సింహం పిల్ల కాదు. .. ఆ రూపంలో ఉన్న కుక్క అనుకున్నారు. కానీ అది నిజం సింహం పిల్లే అని తేలింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అక్కడి పోలీసులు కూడా ఈ అంశంపై విచారణ జరిపారు.
Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

