Viral Video: లోయ అంచులో ఉయ్యాల జంపాల ఆట.. ఇతను జస్ట్ మిస్! ఒళ్లు గగుర్పొడిచే వీడియో
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఇద్దరు స్నేహితులు ఉయ్యాల ఊగడానికి ఓ ప్రమాదకరమైన ప్రదేశానికి ఎంచుకున్నారు.
![Viral Video: లోయ అంచులో ఉయ్యాల జంపాల ఆట.. ఇతను జస్ట్ మిస్! ఒళ్లు గగుర్పొడిచే వీడియో Viral Video: Man Survives falling into valley while swinging with his friend behind a ditch Viral Video: లోయ అంచులో ఉయ్యాల జంపాల ఆట.. ఇతను జస్ట్ మిస్! ఒళ్లు గగుర్పొడిచే వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/99f83069a4ddafc40657a299e4e1fc39_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మనలో అందరం చిన్న తనంలో ఉయ్యాల ఊగే ఉంటాం కదా. అసలు ఉయ్యాల ఊగడమే ఓ సరదా అనుభూతి. వేగంగా పైకి కిందికి ఉయ్యాల ఊగుతూ పక్షుల్లా గాల్లో విహరించే సరదాను పొందవచ్చు. ఎంత పైవరకూ ఉయ్యాల వెళ్తే అంత ఉత్సాహం, సరదా వస్తుంటుంది. చిన్న తనంలో ఇలా ఉయ్యాల ఊగడం దాదాపు అందరూ చేసిందే. ఇప్పుడు ఇళ్లలోనూ కొంత మంది చిన్నపాటి ఉయ్యాలలను అమర్చుకుంటున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉయ్యాలని ఆస్వాదించడం వంటి అనేక వీడియోలను మనం చూస్తుంటాం. ఇవన్నీ పక్కన పెడితే.. ఓ ప్రమాదకర స్థలంలో ఉయ్యాల ఊగుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఇద్దరు స్నేహితులు ఉయ్యాల ఊగడానికి ఓ ప్రమాదకరమైన ప్రదేశానికి ఎంచుకున్నారు. ఇందులో ఇద్దరు స్నేహితులు ఓ అగాథమైన లోయ అంచున ఉయ్యాల ఊగేందుకు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఉయ్యాల ఏర్పాటు చేసి ఒకరినొకరు ఊపుతూ ఉయ్యాల ఊగారు. ఈ క్రమంలోనే ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం చోటు చేసుకుంది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో చివరికి యువకుడు బతికి బయటపడ్డాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇద్దరు స్నేహితులు పర్వతంలాంటి ప్రదేశంలో ఉయ్యాల ఊగేందుకు వెళ్లినట్లు వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలో ఓ స్నేహితుడు మరో స్నేహితుడు ఉయ్యాలలో ఉండగా గట్టిగా ఊపేస్తున్నాడు. అప్పుడే ఆ ఊపుతున్న వ్యక్తి కాలు ఉయ్యాలలో ఇరుక్కుపోయింది. దీంతో అతను లోయవైపు బలంగా నెట్టివేయబడ్డాడు. కానీ, అదృష్టవశాత్తు ఊయల ఊపుతున్న యువకుడు ప్రాణాలతో బయటపడతాడు. ఏ మాత్రం తేడా జరిగినా ఆ యువకుడిని ఆ లోతైన అగాథం మింగేసేది. ఈ వీడియో ఇప్పుడు అంతర్జాతీయంగా నెట్టింట్లో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేంయండి.
View this post on Instagram
Also Read: ఎన్నికలకు ముందు ఎక్కడికి పోతావు చిన్నవాడా! రాహుల్ గాంధీ ఫారెన్ ట్రిప్!
Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)