అమెరికా వద్ద UFOలు ఉన్నాయి, ఏలియన్ డెడ్‌బాడీస్‌నీ దాచి పెట్టారు - మాజీ నిఘా అధికారి సంచలన వ్యాఖ్య
US on UFO: అమెరికా వద్ద UFOలు ఉన్నాయని మాజీ ఇంటిలిజెన్స్ అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనవుతున్నాయి.
US on UFO:
డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇంటిలిజెన్స్ మాజీ ఆఫీసర్ డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వద్ద ఓ ఏలియన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉందని ప్రకటించారు. అంతే కాదు. గ్రహాంతర వాసుల బాడీస్ కూడా అమెరికా ఉన్నాయని తేల్చి చెప్పారు. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా మల్టీ డికేడ్ ప్రోగ్రామ్ (Multi Decade Programme)ని చేపట్టినట్టు వెల్లడించారు. క్రాష్ అయిన UFO (Unidentified Flying Objects)ని రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్టూ చెప్పారు. అమెరికా ప్రభుత్వం UFOలను Unexplained Anomalous Phenomena (UAP)గా పిలుస్తోంది. వీటిపై డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో అనాలసిస్ కొనసాగుతోందని వివరించారు. ఇదే సమయంలో ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేశారు డేవిడ్ గ్రష్. ప్రభుత్వం UFOలకు సంబంధించి కొన్ని సీక్రెట్ ఆపరేషన్‌లు చేస్తోందని చెప్పారు. అయితే...ఈ ఆపరేషన్‌లలో తాను జోక్యం చేసుకోకుండా అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. ఇక్కడితో ఆగలేదు డేవిడ్. ఈ సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన వారిని ప్రభుత్వం ఎలా వేధించిందో కూడా తనకు తెలుసని అన్నారు. ఈ కామెంట్స్‌తో ఒక్కసారిగా అమెరికా డిఫెన్స్ ఉలిక్కిపడింది. డేవిడ్ గ్రష్ మాటల్లో నిజం లేదని ప్రకటించింది. అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు అధికారికంగా దీనిపై స్పందించారు.
"డేవిడ్ గ్రష్ చెబుతున్నట్టుగా ప్రభుత్వం దగ్గర ఎలాంటి UFO కానీ...ఏలియన్ బాడీస్ కానీ లేవు. రివర్స్ ఇంజనీరింగ్ చేసిన దాఖలాలు కూడా లేవు. గతంలోనూ ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. ప్రస్తుతమూ అలాంటివి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు"
- రక్షణ శాఖ ప్రతినిధి, అమెరికా
Former US intelligence official David Grusch says under oath that the US government is in possession of UFOs and non-human bodies pic.twitter.com/tYJA1rNr6Z
— Latest in space (@latestinspace) July 26, 2023
డెడ్‌బాడీస్ కూడా..
యూఎస్ కాంగ్రెస్‌విమెన్ నాన్సీ అడిగిన ప్రశ్నకు డేవిడ్ గ్రష్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలియన్ క్రాఫ్ట్‌లలోని పైలట్స్‌ని అదుపులోకి తీసుకున్నారా అని ప్రశ్నించగా...తాను ఇప్పటికే ఈ విషయం చెప్పాని స్పష్టం చేశారు. నాన్ హ్యూమన్ బయాలజిక్స్‌ని కూడా రికవరీ చేసినట్టు తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా అమెరికాతో పాటు మిత్ర దేశాలు ఈ పని చేస్తున్నాయని చెప్పారు డేవిడ్ గ్రష్.
మిస్టరీగానే...
ఏలియన్స్.... సైన్స్‌కు మాత్రమే కాదు.. గొప్ప గొప్ప సైంటిస్టులకు సైతం ఇప్పటి వరకు అంతుచిక్కని విషయం ఏదైనా ఉందంటే.. అది ఏలియన్స్ గురించనే చెప్పాలి. ఎందుకంటే.. దశాబ్దాల కాలంగా ఏలియన్స్ జాడను కనిపెట్టేందుకు ప్రపంచదేశాలు పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. ఏలియన్స్ గురించి ఏ ఒక్క క్లూ కూడా తెలుసుకోలేకపోయాయి. కేవలం భూమిపై నుంచి కాదు.. స్పేస్‌లో కూడా ఏలియన్స్ గురించి పరిశోధనలు చేసి విఫలమైన దేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఏలియన్స్ జాడను కనిపెట్టడంలో బిజీగా ఉన్న ప్రపంచదేశాలకు గతంలో దిమ్మతిరిగే షాకింగ్ విషయం వెల్లడించారు ప్రఖ్యాతి భౌతిక శాస్ర్తవేత్త స్టీఫెన్ హ్యాకింగ్. ఏదైనా కొత్త ప్రదేశాన్ని, జీవరాశులను కనిపెడితే మానవులు సంతోషిస్తారని, కానీ ఏలియన్లు అలా భావించకపోవచ్చని అన్నారు.
Also Read: కుతకుత ఉడికిపోతున్న భూమి, జులైలో పాత రికార్డులన్నీ బద్దలు - గ్లోబల్ బాయిలింగ్ మొదలైందా?