అన్వేషించండి

China Rocket Debris: భూమిపై పడనున్న చైనా రాకెట్ శకలాలు, మనకు ప్రమాదం పొంచి ఉందా?

China Rocket Debris: చైనాకు చెందిన రాకెట్ శకలాలు భూమిపై పడనున్నాయి. దాదాపు 10 అంతస్తుల భవనమంతా ఉండే ఆ రాకెట్ శిథిలాలు ఎక్కడ పడతాయన్నది శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

China Rocket Debris: చైనాకు చెందిన భారీ రాకెట్ శిథిలాలు భూమిపై పడనున్నాయి. 23 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ శిథిలాలు శుక్రవారం నాడే భూమిపై పడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో వివిధ దేశాలకు చెందిన స్పేస్ స్టేషన్ ఉన్న విషయం తెలిసిందే. చైనా తన కోసం ప్రత్యేకంగా స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తోంది. చైనా చేపట్టిన న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణ పనులు కూడా దాదాపు తుది దశకు వచ్చాయి. 

చైనా తన న్యూ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం చివరి భాగాన్ని సోమవారం విజయవంతంగా ప్రారంభించింది. దీని కోసం చివరి మాడ్యూల్ ను భూమి నుండి అంతరిక్షానికి పంపించింది. ఈ మాడ్యూల్ ను లాంగ్ మార్చ్ 5బి రాకెట్ తో విజయవంతంగా చేరవేసినట్లు చైనా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 5బి రాకెట్ విజయవంతంగా మాడ్యూల్ ను స్పేస్ స్టేషన్ కు చేరవేసిన తర్వాత అది తిరిగి భూమి పైకి వస్తుంది. అలా భూకక్ష్యను చేరుకున్న తర్వాత భూమిపై సముద్రంలో పడుతుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల రీ ఎంట్రీ విండో శుక్రవారం సాయంత్రం మొదలు అవుతుంది. శనివారం అంతా ఇది కొనసాగుతుంది. 

అత్యధిక వేగంతో పై నుండి కిందకు వస్తున్న సమయంలో ఈ  భారీ రాకెట్ లోని కొన్ని భాగాలు కాలిపోతాయి. మిగిలిన భాగాలు భూమిపై పడతాయి. ఈ రాకెట్ భారీ పరిమాణంలో ఉంటుంది. దాదాపు 10 అంతస్తుల భవనం అంత పెద్దగా 23 టన్నుల బరువుతో ఉంటుంది. ఇప్పుడు భూమిపై పడనున్న 5బి రాకెట్ శకలాలు భూమిపై ఎక్కడ పడతాయన్నది శాస్త్రవేత్తలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అలా ఈ శిథిలాల వల్ల ప్రజలకు కొంత ప్రమాదం పొంచి ఉందని ఏరోస్పేస్ కార్పొరేషన్ అప్రమత్తం చేస్తోంది. 


రాకెట్ శిథిలాలు 88 శాతం జనాభా నివసించే ప్రాంతాల్లోనే పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జన సాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ శాతం పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో పడే అవకాశం కూడా ఉంది. అలా జన సంచారం లేని చోట పడితే ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని వేగంగా నిర్మిస్తోంది. అయితే ఈ స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం అవసరం అయ్యే మాడ్యూళ్లను తరలించేందుకు చైనా ఈ 5బి రాకెట్ ను ప్రయోగిస్తూ వస్తోంది. అలా 2020 వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ రాకెట్ తోనే మాడ్యూళ్లను చేరవేస్తోంది. అంతకుముందు చైనా ప్రయోగించిన మూడు రాకెట్లు కూడా ఇలాగే భూమిపై పడిపోయాయి. 2021లో ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి రాకెట్ శిథిలాలు మాల్దీవుల సమీపంలో కూలిపోయాయి. అలాగే ఈ ఏడాదిలో ప్రయోగించిన రాకెట్ శకలాలు మలేసియా, ఇండోనేసియా సమీపంలోని ఓ ద్వీపంలో, ఫిలిప్పీన్స్ సమీపంలోని ఓ సముద్రంలో పడిపోయాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
Donald Trump Buffalo Bangladesh: హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందని బర్రెకు ట్రంప్ పేరు పెట్టారు - బాగానే ఉంది కానీ బక్రీద్‌కు కోసుకు తినేస్తారట - బంగ్లాదేశ్‌ వాళ్లకు భయం లేదా?
హెయిర్ స్టైల్ మ్యాచ్ అయిందని బర్రెకు ట్రంప్ పేరు పెట్టారు - బాగానే ఉంది కానీ బక్రీద్‌కు కోసుకు తినేస్తారట - బంగ్లాదేశ్‌ వాళ్లకు భయం లేదా?
Ivanka Trump Assassination Plot: ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
ఎంతకు తెగించార్రా ? - ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ చేస్తారా?
USA Iran Peace Agreement:అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!
అమెరికా-ఇరాన్ మధ్య ముగిసిన పోరు! ప్రపంచానికి ఊరటనిచ్చిన శాంతి ఒప్పందం!

వీడియోలు

Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
City Facelift EMI Calculator: కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
కొత్త హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ ఈఎంఐ లెక్కలు: టాప్ వేరియంట్ లోన్ టెన్యూర్, ఈఎంఐ వివ‌రాలు
Embed widget