China Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం, ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు
చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్‌లో జనవరి 22న రాత్రి 11.39 ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలు మీద భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.
China Earthquake: చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్‌లో జనవరి 22న రాత్రి 11.39 ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలు మీద భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో 80 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
భూకంప తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. చైనా లో సంభవించిన భూకంపం ప్రభావం భారత్ లో కనిపించింది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే నిద్ర పోయే సమయంలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
An earthquake with a magnitude of 7.2 on the Richter Scale hit Southern Xinjiang, China today at 11.39 pm: National Centre for Seismology
— ANI (@ANI) January 22, 2024