IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Covid-19 New Variant XE: గుబుల్ గుబుల్‌గా గుండెలదరగా- కొత్త వేరియంట్ XE, 10 రెట్లు ఫాస్ట్ గురూ!

ప్రపంచాన్ని హడలెత్తించడానికి మరో కొత్త వేరియంట్ XE బయలుదేరింది. ఇప్పటికే ఈ వేరియంట్‌కు సంబంధించి 600 కేసులకు పైగా నమోదయ్యాయి.

FOLLOW US: 

కరోనా ఇంకా ప్రపంచాన్ని వదిలిపోలేదు. ఆసియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ భయపెడుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ఈ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా మరో కొత్త వేరియంట్ XE దీనికి జత కలిసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ వివరాలను వెల్లడించింది. 

అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కంటే XE వేరియంట్ దాదాపు 10 రెట్లు వేగవంతమైంది. దీంతో ఈ కొత్త వేరియంట్‌పై అన్ని దేశాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. అయితే దీనిని ఇంకా ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్ఓ గుర్తించలేదు. దీనిపై విచారణ చేస్తోంది.

ఫోర్త్ వేవ్

ఆసియా, ఐరోపాలలోని చాలా దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతిరోజు అక్కడ 5 లక్షల కొత్త కేసులు నమోదవతున్నాయి. చైనాలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. దీంతో చాలా నగరాలను లాక్‌డౌన్‌లో ఉంచారు. దీంతో ఈ వైరస్‌పై సర్వత్రా ఆందోళన ఉంది. మరి ఈ వేరియంట్ గురించి ఈ ఐదు విషయాలు తెలుసుకుందాం.

1. కాంబినేషన్

ఇప్పటివరకు గుర్తించిన కొన్ని వేరియంట్లు కలిసి కొత్త వేరియంట్‌గా ఆవిర్భవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. గతంలో ఒమిక్రాన్, డెల్టా కలిసి డెల్టాక్రాన్ వేరియంట్ వచ్చింది. ఇప్పుడు అలానే ఒమిక్రాన్ BA1, BA2 సబ్ వేరియంట్లు కలిపి XE వేరియంట్‌గా మారాయి. ఒక దాని కంటే ఎక్కువ వేరియంట్లు ఎవరికైనా సోకినప్పుడు ఇలా కొత్త వేరియంట్ పుడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2. XE వైరస్ అంత డేంజరా?

పలు దేశాల్లో కరోనా ఫోర్త్ వేవ్ భయపెడుతుండటంతో ఈ వేరియంట్‌పై ఆందోళన ఉంది. అయితే ఇతర వేరియంట్లతో కలిసి కొత్తగా వచ్చే కరోనా వేరియంట్లు అంత ప్రాణాంతకం కాదని, త్వరగా చనిపోతాయని యూకే హెల్త్ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హోప్‌కిన్స్‌ అన్నారు.

3. XE 'ఆందోళనకర వేరియంటా'?

ఈ వేరియంట్ వివరాలను డబ్ల్యూహెచ్ఓ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌కు సంబంధించి 637 కేసులు నమోదయ్యాయి. యూకేలో ఈ వేరియంట్‌ను మొదటగా గుర్తించారు. 2022, జనవరి 19న తొలిసారి ఈ వేరియంట్ శాంపిల్స్ దొరికాయి. అయితే ఈ వేరియంట్ తీవ్రతపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని హోప్‌కిన్స్‌ అన్నారు.

4. అత్యంత వేగం 

XE వేరియంట్ చాలా వేగంగ వ్యాప్తి చెందగలదని నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది దాదాపు 10 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంటే అత్యంత వేగవంతమైనదని అంతా అనుకున్నారు. ఎందుకంటే తేరుకునే లోపే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్యను భారీగా పెంచి మరో వేవ్‌ను తీసుకువచ్చింది.

5. డబ్ల్యూహెచ్ఓ పర్యవేక్షణ 

ఈ వేరియంట్‌ను డబ్ల్యూహెచ్ఓ పరిశీలిస్తోంది. దీనిపై మరింత సమాచారం సేకరిస్తోంది. మునుపటి వేరియంట్లకు ఈ వేరియంట్‌కు వ్యాప్తి, సామర్థ్యంలో ఏం తేడాలు ఉన్నాయో దర్యాప్తు చేస్తోంది.

Published at : 05 Apr 2022 12:59 PM (IST) Tags: COVID-19 Covid-19 4th Wave 5 Facts on New Variant XE New Variant XE

సంబంధిత కథనాలు

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

LSG vs RCB, Eliminator Highlights: LSGని ఎలిమినేట్‌ చేసిన RCB - రాహుల్‌ సేనను ముంచిన క్యాచ్‌డ్రాప్‌లు!

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

Gold-Silver Price: వరుసగా రెండోరోజూ బంగారం ధర షాక్! పెరిగిన పసిడి, వెండి ధరలు

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్