Office Affair: ఇంట్లో ఇల్లాలు, ఆఫీస్‌లో ప్రియురాలు - లవర్‌తో కాన్సర్ట్‌కు వెళ్తే లైవ్‌లో చూపించారు - పాపం ఈ సీఈవో జీవితం క్షణంలో తిరగబడింది !
Coldplay: ఇంట్లో ఇల్లాలితో సరసాలు..బయటకు వెళ్లినప్పుడు ఓ కొలీగ్‌తో సంబంధం పెట్టుకున్నాడో సీఈవో. ఓ మ్యూజిక్ కాన్సర్ట్ కు వెళ్లాడు. అక్క మైకంలో ఉండగా లైవ్ లో చూపించారు. అంతే..

Coldplay Outs Astronomer Office Affair: ఆటల పోటీలు జరుగుతున్నప్పుడు.. మ్యూజిక్ కాన్సర్ట్‌లు జరుగుతున్నప్పుడు మైమరిపోయే జంటల్ని చూపించడం సహజం. ఇలా చూపించినప్పుడు ఆ జంటలు సంతోషపడతాయి. కానీ ఒక్కో సారి అవి వారి జీవితాలను తలకిందులు చేస్తాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలోని మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్‌ప్లే కన్సర్ట్ లో చోటు చేసుకుంది.
కన్సర్ట్ సందర్భంగా స్టేడియం జంబోట్రాన్‌లో "కిస్ క్యామ్" సెగ్మెంట్ సమయంలో, ప్రేక్షకులలో ఉన్న జంటలపై కెమెరా ఫోకస్ చేస్తుంది. ఇలా ఓ జంటపై ఫోకస్ చేసింది. కోల్డ్‌ప్లే కాన్సర్ట్ జోరుగా సాగుతున్న సమయంలో వయసులో కాస్త పెద్దగా ఉన్న జంట మైమరిచిపోయి ఆస్వాదిస్తున్నారు. లైటింగ్ వేసేవాళ్లు..కెమెరామెన్ ఒక్క సారి ఆ జంటకు హైలెట్ చేశారు. తమను లైవ్ లో చూపిస్తున్నారని తెలియగానే ఆ లవర్ ఒక్క సారిగా కిందకు వంగి ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. అక్కడే అసలు విషయం బయటపడింది. వారిద్దరూ భార్యా భర్తలు లేదా .. లవర్స్ కాదని.. ఇల్లీగల్ వ్యవహారంలో ఉన్న వాళ్లని గుర్తించారు.
Busted!
— Mrs. SpaceX ™️ (@anuibi) July 17, 2025
This backfired real quick.
CEO and HR having an affair and were outed during Coldplay‘s concert 👀
Andy Byron and Kristin Cabot from Astronomer 😬😬😬
Wife‘s Facebook has already been found and people commenting on it. pic.twitter.com/RWgYDVMuaV
ఆ ఇల్లీగల్ లవర్ ఎవరంటే.. ఆస్ట్రోనమర్ కంపెనీ CEO అయిన ఆండీ బైరన్ , ఆయనతో పాటు కాన్సర్ట్ కు వచ్చిన లవర్ అదే కంపెనీలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబట్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. బైరన్ కాబట్‌ను వెనుక నుండి కౌగిలించుకున్నారు. తమను జంబోట్రాన్‌పై చూసిన వెంటనే, ఇద్దరూ ఇబ్బందిగా స్పందించారు. బైరన్ ఒక అడ్డుగోడ వెనుక దాక్కున్నాడు. కాబట్ తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది. ఈ ఘటనను ఒక ప్రేక్షకుడు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేశాడు. క్షణాల్లో వైరల్ గా మారింది. బైరన్, కాబట్‌ల మధ్య జరుగుతున్న వ్యవహారం బట్టబయలైంది. వీరిద్దరికీ వేర్వేరు కుటుంబాలు ఉన్నాయి.
ఆస్ట్రోనమర్ కంపెనీ CEOగా బైరన్ ఉన్నారు. ఇది న్యూయార్క్ ఆధారిత డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు AI కంపెనీ, 2022లో యూనికార్న్ స్థాయి (1 బిలియన్ డాలర్ల విలువ) సాధించింది. బైరన్ 2023 జూలై నుండి CEOగా ఉన్నాడు. అతను మేగన్ కెర్రిగన్ బైరన్‌తో వివాహం చేసుకున్నాడు . వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు బోస్టన్‌కు సమీపంలోని నార్త్‌బోరోలో నివసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత బైరన్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ను తొలగించాడు. బైరన్ లవర్ కాబట్ 2024 నవంబర్ నుండి ఆస్ట్రోనమర్‌లో చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా ఉన్నారు. కెన్నెత్ సి. థార్న్‌బైను వివాహం చేసుకుంది. కాబట్ పలు కంపెనీలలో హెచ్ ఆర్ గా పని చేశారు.
ఈ ఘటన బైరన్ మరియు కాబట్‌ల వ్యక్తిగత జీవితాలపై, అలాగే ఆస్ట్రోనమర్ కంపెనీపై పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వీడియోతో వారి జీవితాలు తలకిందులయ్యాయని అందరూ సెటైర్లు వేస్తున్నారు.





















