News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

అక్రమ సంబంధాలు పెట్టుకుంటే బయటకు గెంటేస్తాం, ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన కంపెనీ

Chinese Firms Rules: చైనాలోని ఓ కంపెనీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఉద్యోగులను ఇంటికి పంపేస్తామని తేల్చి చెప్పింది.

FOLLOW US: 
Share:

Chinese Firms Rules: 

చైనాలోని కంపెనీలో రూల్..

చైనాలోని ఝెజియాంగ్‌లోని ఓ కంపెనీ వింత రూల్స్ పెట్టి ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఎంప్లాయిస్‌లో ఎవరైనా సరే...వివాహేతర సంబంధం పెట్టుకుంటే బయటకు గెంటేస్తామని తేల్చి చెప్పింది. కుటుంబ విలువలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జూన్ 9వ తేదీన వివాహేతర సంబంధంపై నిషేధం విధిస్తూ ఓ సర్క్యులర్ పాస్ చేసింది. పెళ్లైన స్టాఫ్‌ అందరికీ ఇది వర్తిస్తుందని వెల్లడించింది. అప్పటికే కొందరిని కంపెనీ నుంచి బ్యాన్ చేసింది. ఫలితంగా...చైనాలోని సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతోంది. అటు కంపెనీ మాత్రం రూల్ గురించి అందరికీ వివరిస్తోంది. 

"కంపెనీ మేనేజ్‌మెంట్‌ని బలోపేతం చేయడానికి, కుటుంబ విలువలకు కట్టుబడి ఉండడంతో పాటు కుటుంబ సభ్యులతో నిజాయతీగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొచ్చాం. భార్యాభర్తల మధ్య బంధం బలపడడానికీ ఇది ఉపయోగపడుతుంది. ఫ్యామిలీని చూసుకుంటూనే పనిపై శ్రద్ధ పెట్టాలనేదే మా లక్ష్యం. పెళ్లైన ఉద్యోగులందరూ ఇది మనసులో పెట్టుకుని నడుచుకోవాలి. ఎవరు నిబంధన ఉల్లంఘించినా ఉద్యోగం ఊడుతుంది. అందరూ ప్రేమకు విలువనివ్వాలి. మంచి ఉద్యోగులుగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇల్లీగల్ అఫైర్స్‌కి నో చెప్పండి. విడాకులకూ దూరంగా ఉండండి. "

- కంపెనీ మేనేజ్‌మెంట్ 

ఇదీ విషయం..

అయితే..ఈ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి స్థానిక మీడియాకి కీలక విషయాలు చెప్పాడు. కుటుంబంలో ఎలాంటి విభేదాలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఉద్యోగుల కుటుంబంలో సమస్యలొస్తే...అది కంపెనీ ప్రొడక్టివిటీపైనా ప్రభావం చూపిస్తుందని వివరించాడు. కంపెనీలో కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారని తెలిసే...యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే ఈ డిసిషన్‌పై పెద్ద డిబేట్ నడుస్తోంది. 

టైమ్‌ని రెంట్‌కి ఇస్తున్న చైనా యువతి..

సాధారణంగా కొంత మంది ఒంటరిగా షాపింగ్‌కి వెళ్లాలన్నా, మరేపనిమీద బయటకెళ్లాలన్నా పెద్దగా ఆసక్తి చూపించరు. బోర్ ఫీల్ అవుతారు. ఎవరైనా తోడుగా వస్తే బాగుండు అనుకుంటారు. అదిగో అలాంటి వాళ్లకు తన టైమ్‌ని అద్దెకి ఇస్తోంది 26 ఏళ్ల ఓ యువతి. భలే ఉంది కదా ఐడియా. అలా వాళ్లతో షాపింగ్‌కో, లేదంటే సరదాగా సినిమాకో వెళ్తుంది. ఫ్రీగా కాదు. గంటకు ఓ యువాన్ ఇచ్చుకోవాల్సిందే. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ.11 అన్నమాట. అంటే గంటకు రూ.11 ఇస్తే చాలు ఎన్ని గంటలైనా మనతోపాటు ఉంటుంది. 26 ఏళ్ల పెగ్గీ అనే యువతి ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో ఓ సంచలనం. గత నెలలోనే ఈ కొత్త ఐడియాను ఇంప్లిమెంట్ చేసింది. ఈ వింత వ్యాపారానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందట. "ఒంటరిగా వెళ్లలేని వాళ్లకు, అలా వెళ్లేందుకు భయపడే వాళ్లకు నేను తోడుగా ఉంటాను. అదే నా జాబ్" అని వివరిస్తోంది పెగ్గీ. అలా చేయడం వల్ల అవతలి వాళ్లు ఒంటరితనం నుంచి బయటపడతారని తన ఐడియా వెనక ఉన్న ఫిలాసఫీనీ చెబుతోంది. ఈ మధ్యే ముగ్గురు గ్రాడ్యుయేట్‌లు తన ఐడియాకి అట్రాక్ట్‌ అయ్యి రెంట్‌ ఇచ్చేందుకు ఒప్పుకున్నారట. వాళ్లతో కలిసి ఎంచక్కా ట్రెకింగ్ కూడా వెళ్లొచ్చింది. 

Also Read: Bronze Sword: తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి కంచు ఖడ్గం, ఇప్పటికీ అదే మెరుపు

Published at : 18 Jun 2023 12:38 PM (IST) Tags: extramarital affairs Chinese Firms Rules Chinese Firm Rules Extramarital Affairs Prohibition Divorce Prohibition

ఇవి కూడా చూడండి

Luxury City Dubai: చేపలు పట్టుకునే స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి - లగ్జరీ సిటీ దుబాయ్ హిస్టరీ ఇదే

Luxury City Dubai: చేపలు పట్టుకునే స్థాయి నుంచి ఇంటర్నేషనల్ రేంజ్‌కి - లగ్జరీ సిటీ దుబాయ్ హిస్టరీ ఇదే

Gaza: పాలస్తీనా జెండా పట్టుకుని ఒంటికి నిప్పంటించుకున్న మహిళ, ఇజ్రాయేల్ కాన్సులేట్ ఎదుటే ఘటన

Gaza: పాలస్తీనా జెండా పట్టుకుని ఒంటికి నిప్పంటించుకున్న మహిళ, ఇజ్రాయేల్ కాన్సులేట్ ఎదుటే ఘటన

Gaza: AI టూల్స్‌తో హమాస్‌పై ఇజ్రాయేల్ యుద్ధం, టార్గెట్ ఫిక్స్ చేస్తే క్షణాల్లో విధ్వంసం

Gaza: AI టూల్స్‌తో హమాస్‌పై ఇజ్రాయేల్ యుద్ధం, టార్గెట్ ఫిక్స్ చేస్తే క్షణాల్లో విధ్వంసం

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

Massive Solar Storms: సౌరవ్యవస్థలో తుఫాన్‌లు, భవిష్యత్తులో ఇంటర్నెట్, జీపీఎస్ పనిచేయవట

Massive Solar Storms: సౌరవ్యవస్థలో తుఫాన్‌లు, భవిష్యత్తులో ఇంటర్నెట్, జీపీఎస్ పనిచేయవట

టాప్ స్టోరీస్

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత

Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత