Bronze Sword: తవ్వకాల్లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి కంచు ఖడ్గం, ఇప్పటికీ అదే మెరుపు
Bronze Sword: 3 వేల ఏళ్ల నాటి కంచు ఖడ్గాన్ని జర్మనీలోని ఓ సిటీలో తవ్వకాల్లో గుర్తించారు.
Bronze Sword:
జర్మనీలో బయట పడ్డ ఖడ్గం..
ఆర్కియాలజిస్ట్‌లో 3 వేల ఏళ్ల నాటి అరుదైన కంచు ఖడ్గాన్ని వెలికి తీశారు. ఐరోపా దేశమైన జర్మనీలో ఈ ఖడ్గం వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లైనా ఇప్పటికీ అది చెక్కు చెదరలేదు. పైగా...కొత్త దానిలా మెరుస్తోంది. 3 వేల ఏళ్లకుపైగానే చరిత్ర ఉన్న ఖడ్గం అని ఆర్కియాలజిస్ట్‌లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఖడ్గం ఎవరిది..అని పెద్ద డిస్కషన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరి కొన్ని వివరాలు శాస్త్రవేత్తలు తెలిపారు. జర్మనీలోని నార్డ్‌లింగెన్ (Nördlingen) సిటీలో జరిగిన తవ్వకాల్లో ఇది బయట పడింది. దీనిపై బవారియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ (Bavarian State Office for Preservation of Monuments) అధికారికంగా ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. 14వ శతాబ్దానికి చెందిన ఖడ్గం అని తేల్చి చెప్పింది. ఇప్పటికీ మెరిసిపోతోందని వెల్లడించింది. ఈ ఖడ్గం దొరికిన ప్రాంతంలోనే ఓ మహిళ, పురుషుడు, బాలుడి ఎముకలు కనిపించాయి. అంతే కాదు. మరి కొన్ని కంచు వస్తువులనూ గుర్తించారు. ఇలాంటి ఖడ్గాల్ని ఇప్పుడు తయారు చేయడం సాధ్యం కానే కాదని తేల్చి చెప్పారు ఆర్కియాలజిస్ట్‌లు. డిజైన్ చాలా అరుదుగా ఉందని, ఎవరినైనా ఒకే ఒక వేటుతో చంపేయగలదని వివరించారు. అయితే...ఈ ఖడ్గాన్ని చూసిన కొందరు ఇండియన్స్..భారత దేశ చరిత్రకు దీన్ని ముడి పెడుతున్నారు. వేలాది ఏళ్ల క్రితం భారత్‌లోని రాజులు, చక్రవర్తులు ఇలాంటి ఖడ్గాలనే వాడినట్టు చెబుతున్నారు. భారత్‌లో శతాబ్దాల పాటు కంచు వస్తువులను వినియోగించినట్టు గుర్తు చేస్తున్నారు. మొహంజదారో, హరప్పా నాగరికతల గురించి ప్రస్తావిస్తున్నారు.
Wow! A Bronze Age sword found in #Germany is in such a pristine state of preservation, it is hard to believe it is legitimate. But legitimate it is!https://t.co/lAOfdkLbQV
— Ancient Origins (@ancientorigins) June 16, 2023
టిప్పు సుల్తాన్ ఖడ్గం వేలం..
18వ శతాబ్దంలో మైసూర్‌ని ఏలిన టిప్పు సుల్తాన్ ఖడ్గం లండన్‌లో వేలం వేయగా...రూ.140 కోట్లకు అమ్ముడుపోయింది. Auction House Bonhams ఈ ఆక్షన్‌ని ఆర్గనైజ్ చేసింది. అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ మొత్తానికే అమ్ముడుపోయినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ఇది టిప్పు సుల్తాన్‌కి బాగా నచ్చిన ఖడ్గమని, ఆయన వాడిన ఆయుధాల్లో ఇది అత్యంత కీలకమైందని స్పష్టం చేసింది. 18వ శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నింటినీ వరుసగా గెలిచి చరిత్ర సృష్టించాడు టిప్పు సుల్తాన్. 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు చెబుతోంది బోన్హమ్స్ సంస్థ.
ఈ అత్యద్భుతమైన ఖడ్గం ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థల అధీనంలో ఉంది. టిప్పు సుల్తాన్ వాడిన ఆయుధాల్లో ఇది చాలా కీలకమైంది. దీన్ని క్యాప్చర్ చేసినప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకూ అత్యంత అద్భుతంగా తయారైన ఖడ్గాల్లో ఇది ఒకటి. అందుకే దీనికి అంత డిమాండ్ వచ్చింది. ఈ ఖడ్గానికి గొప్ప చరిత్ర ఉంది. ఇద్దరు బిడ్డర్స్ పోటాపోటీగా వేలం పాట పాడారు. చివరికి అది రూ.140 కోట్ల దగ్గర ఫైనలైజ్ అయింది"
- ఆక్షన్ నిర్వాహకులు
Also Read: Viral Video: హాస్పిటల్ లిఫ్ట్‌లోకి స్కూటర్, వీల్‌ఛైర్ లేదని కొడుకుని ఇలా తీసుకెళ్లాడు - వైరల్ వీడియో