China: బుల్లెట్ ట్రైన్స్ ఓల్డ్ ఫ్యాషన్ - హైపర్ సోనిక్ విమానాలు కొత్త స్టైల్ - గంటకు ఐదు వేల కిలోమీటర్లు
Chaina drone: హైపర్‌సోనిక్ టెక్నాలజీతో మనుషుల్ని ఓ చోట నుంచి మరో చోటకు కనురెప్ప ముగిసేలోపు తీసుకెళ్లేలా చైనా సన్నాహాలు చేస్తోంది. ధ్వని కంటే నాలుగు రెట్లు వేగాన్ని చేరుకోగల డ్రోన్ ను రెడీ చేసింది.

China commercial Mach 4 drone tipped to make first flight next year: హైపర్‌సోనిక్ టెక్నాలజీని వాణిజ్యంగా ఉపయోగించే విషయంలో చైనా ముందడుగు వేసింది. మనుషుల్ని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న మాక్-4 డ్రోన్ వచ్చే ఏడాది ఎగిరేలా ప్లాన్ చేసుకుంంటటున్నారు. ఓ చైనీస్ స్టార్టప్ తన సూపర్‌ఫాస్ట్ డ్రోన్ ను ధ్వని కంటే నాలుగు రెట్లు వేగాన్ని చేరుకోగల సామర్థ్యంతో రెడీ చేసింది. వచ్చే ఏడాది మొదటి విమానాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.
సూపర్‌సోనిక్ ప్యాసింజర్ జెట్‌ను అభివృద్ధి చేసేందుకు స్టార్టప్ విస్తృత పరిశోధనలు చేస్తోంది. అందులో భాగంగా మానవరహిత వైమానిక వాహనం (UAV)ను సిచువాన్ లింగ్‌కాంగ్ టియాన్క్సింగ్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తోంది. ఈ సూపర్ సోనిక్ ప్యాసింజర్ జెట్ బరువు 1.5 టన్నులు . ఏడు మీటర్లు పొడవు ఉంటుంది ఇది 20 కి.మీ ఎత్తులో మాక్ 4.2 క్రూజింగ్ వేగాన్ని అంటే ధ్వని కన్నా నాలుగు రెట్ల ఎక్కువ వేగాన్ని అందుకోగలదు. సూపర్ సోనిక్ విమానం మొదటి ప్రయాణం వచ్చే ఏడాది ఉండేలా ప్లాన్ చేసారు.
సైనిక హార్డ్‌వేర్‌లో సూపర్‌సోనిక్ టెక్నాలజీ కీలకమైన అంశంగా ఉంది . దీన్న ఇటీవలి కాలంలో వాణిజ్య పరంగా వాడుతున్నారు. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్‌లు సూపర్ సోనిక్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నాయి. బూమ్ సూపర్‌సోనిక్ , హెర్మియస్ వంటి యుఎస్ స్టార్టప్‌లు విభిన్న సాంకేతిక విధానాలను అనుసరించిప్రయోగాలు చేస్తున్నాయి. ధ్వని కంటే ఐదు రెట్ల వేగంగా హైపర్‌సోనిక్ విమానాన్ని ప్రయోగించాలని ప్రయత్నిస్తున్నాయి. స్విస్ స్టార్టప్ డెస్టినస్ హైడ్రోజన్-శక్తితో పనిచేసే హైపర్‌సోనిక్ జెట్‌లపై పరిశోధనలు చచేేస్తోంది. అయితే వాణిజ్య పరంగా ఇప్పటి వరకూ ముందడుగుపడలేదు.
Also Read: సిజేరియన్లకు పరుగులు పెడుతున్న ప్రెగ్నెంట్ మహిళలు - పిల్లలకు పౌరసత్వం కోసం అమెరికాలో కొత్త హడావుడి !
లింగ్‌కాంగ్ టియాన్సింగ్ టెక్నాలజీ తన పరిశోధనను వేగవంతం చేస్తోంది. ఏరోడైనమిక్స్, హీట్ రెసిస్టెన్స్ , కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక సాంకేతికతలను అంచనా వేయడానికి గత అక్టోబర్‌లో టెస్టులను పూర్తి చేసింది. ప్రయోగాలు విజయవంతంగా సక్సెస్ అవుతూండటంతో ఓఏడాది ముందుగానే రెడీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 45 సెకన్ల విమాన పరీక్షను నిర్వహించి, కీలకమైన విమాన పారామితులను సేకరించింది. పరీక్ష సమయంలో UAV దాదాపు 10 కి.మీ.లు ప్రయాణించింది. గంటలకు ఐదు వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని చెబుతున్నారుు. విమానం మంచి ఇంధన సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
సూపర్‌కంప్యూటింగ్ సిమ్యులేషన్‌లతో కలిపి గత ఆరు సంవత్సరాలుగా 88 టెస్ట్ ఫ్లైట్‌లు నిర్వహించారు. ఎయిర్‌ఫ్రేమ్ కోసం దాని స్వంత 3D ప్రింటింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించింది. ఈ సూపర్ సోనిక్ విమానం అందుబాటులోకి వస్తే ప్రపంచ ఎయిర్ ట్రాన్స్ పోర్టు రంగంలో సంచలనం నమోదవుతుంది.
Also read: నాలుగో తరగతిలో బిల్ గేట్స్ రాక్స్ - టీచర్ షాక్స్ - ఆవు మూత్రపిండాలు తీసుకెళ్లాడట మరి !





















