Brooklyn Subway Shooting: న్యూయార్క్‌లో భారీ పేలుడు, కాల్పుల మోత- పలువురికి గాయాలు
న్యూయార్క్‌లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో 13 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.
అమెరికా (America)లో మళ్లీ బాంబులు, తూపాాకీల మోత మోగింది. న్యూయార్క్ (Newyork) బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్ (Brooklyn Subway Station) వద్ద పేలుడు, కాల్పుల ఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనల్లో 13 మంది వరకు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
#UPDATE At least 13 people have been injured in a shooting incident at a subway station in the New York City borough of Brooklyn, where "several undetonated devices" were recovered, authorities said Tuesday https://t.co/JdTaUMNuQ3 pic.twitter.com/7fIffRJJvH
— AFP News Agency (@AFP) April 12, 2022
Multiple people were shot at a subway station in Brooklyn, New York, the city fire department said. A photo from the scene showed people tending to bloodied passengers lying on the floor station: The Associated Press
— ANI (@ANI) April 12, 2022
ఏం జరిగింది?
బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్‌లో అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శబ్దం రాగానే జనాలు భయంతో పరుగులు పెట్టారు.
అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో పలు పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి. ఓ అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పారిపోగా.. పట్టుకునేందుకు మెట్రోస్టేషన్లు మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
ఎఫ్‌బీఐ దర్యాప్తు
ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనేదానిపై ఇంకా స్పష్టత లేదు. న్యూయార్క్ నగరానికి చెందిన బాంబు తనిఖీ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడు ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టింది. ఎందుకు కాల్పులు జరిగాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Also Read: Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు