అన్వేషించండి

Modi Congratulates New Pak PM: పాకిస్థాన్ ప్రధానికి తనదైన స్టైల్‌లో మోదీ శుభాకాంక్షలు

పాకిస్థాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోందని మోదీ ట్వీట్ చేశారు.

" పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన మహమ్మద్ షెహబాజ్ షరీఫ్‌కు శుభాకాంక్షలు. ఉగ్రవాద రహితమైన ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోంది. అప్పుడే మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టి పెట్టగలం. ఇదే మన ప్రజలకు శ్రేయస్కరం.                                                                  "
- ప్రధాని నరేంద్ర మోదీ

ఏకగ్రీవంగా

పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఎవరంటే?

మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్‌ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు.

షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 

ఐదు పెళ్లిళ్లు

షెహబాజ్‌ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్​లో జన్మించారు. షెహబాజ్‌ తండ్రి ముహమ్మద్‌ షరీఫ్‌ స్వస్థలం కశ్మీర్‌ (భారత్‌)లోని అనంతనాగ్‌. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్​ లాహోర్​లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

షెహబాజ్​ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.షెహబాజ్‌ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు. బ్రిటన్​లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్​పై ఉంది.

Also Read: Pakistan Political Crisis: పాకిస్థాన్ కొత్త ప్రధాని ముందు 3 సవాళ్లు- 'కశ్మీర్' సమస్యకు పరిష్కారం దొరికేనా?

Also Read: China Covid Outbreak: కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget