News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పర్వతాల మధ్య ప్రమాదకర నిచ్చెన, ఎక్కుతూ లోయలో పడిన వ్యక్తి - అక్కడికక్కడే మృతి

British Man Death: ఆస్ట్రియాలోని నిచ్చెన ఎక్కుతూ బ్రిటీష్ టూరిస్ట్ కాలు జారి లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

FOLLOW US: 
Share:

British Man Death: 

బ్రిటీష్ టూరిస్ట్ మృతి 

ఆస్ట్రియాలో ఓ బ్రిటీష్ టూరిస్ట్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఆ దేశంలో చాలా పాపులర్ అయిన Stairway to Heaven కి వెళ్లిన ఆ వ్యక్తి ఎక్కుతుండగానే చనిపోయాడు. 42 ఏళ్ల వ్యక్తి ఒక్కడే ఆ నిచ్చెన ఎక్కుతూ వెళ్లాడు. 90 మీటర్ల ఎత్తుకి వెళ్లిన తరవాత ఉన్నట్టుండి కాలు జారింది. పట్టుతప్పి కింద ఉన్న లోయలో పడిపోయాడు. సెప్టెంబర్ 12న ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాలు జారి కింద పడిపోయిన వెంటనే పోలీస్ ఆఫీసర్స్‌తో పాటు రెండు రెస్క్యూ హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాపాడాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డెడ్‌బాడీ కోసం వెతికి చివరకు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందని పోలీసులు వెల్లడించారు. ఆ నిచ్చెన ఎక్కే సమయంలో ఒక్కడే ఉన్నాడని, ఆ వ్యక్తి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. డచ్‌స్టెయిన్ మౌంటేన్స్ వద్ద ఏర్పాటు చేసిన ఈ నిచ్చెన అక్కడి టూరిస్ట్ స్పాట్‌లలో చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా ట్రెకింగ్, క్లైంబింగ్ అంటే ఆసక్తి చూపించే వాళ్లు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఆ సరదా తీర్చుకుంటారు. అయితే...ఈ క్లైంబింగ్ ప్రాసెస్ మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది. కాకపోతే చాలా రిస్క్‌తో కూడుకున్న పని ఇది. చాలా మంది కేవలం కిక్కు కోసం ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. బ్రిటీష్ టూరిస్ట్ కూడా అందుకోసమే ప్రయత్నించినా ప్రమాదావశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. నిజానికి క్లైంబింగ్‌, ట్రెకింగ్‌లో అనుభవం ఉన్న వారికి మాత్రమే ఈ నిచ్చెన ఎక్కే అవకాశమిస్తారు. అంతే కాదు. వాతావరణ పరిస్థితులూ అనుకూలించాలి. కానీ ఈ రూల్స్ పాటించకుండా బ్రిటీష్ టూరిస్ట్‌కి అవకాశమిచ్చారు. అది చివరకు ప్రాణాల మీదకు వచ్చింది. 

View this post on Instagram
 
A post shared by 365 Austria (@365austria)

అత్యంత ఎత్తైన భ‌వ‌నాల‌ను అధిరోహించ‌డంలో ఎక్స్‌పర్ట్‌ అయిన ఫ్రాన్సు కు చెందిన రెమీ లుసిడి (Remi Lucidi) ఇటీవల ప్ర‌మాద‌వ‌శాత్తు 68వ అంత‌స్తు నుంచి ప‌డి మృతి చెందాడు. అత్యంత ఎత్తైన భ‌వ‌నాల‌ను అధిరోహిస్తూ.. ప్ర‌మాదాల‌తో చెల‌గాట‌మాడ‌డం (Daredevil) అత‌డికి స‌ర‌దా. ఆ స‌ర‌దానే ఇప్పుడు అత‌డి ప్రాణాల‌ను కోల్పోయేలా చేసింది. రెమీ లుసిడి అనుమతులు లేకుండా ఓ భవంతిపై నుంచి అదుపు తప్పి పడిపోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌లో చోటు చేసుకొంది. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను అధిరోహించేందుకు ప్రయత్నించాడు. 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్‌ కిటికి బయట చిక్కుకుపోయాడు. భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. ఇరుక్కుపోయిన లుసిడిని చూసిన ఓ మహిళ పోలీసుల‌కు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చే లోపే రెమీ కాలు పట్టు తప్పింది. నేరుగా కిందపడిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌ అధికారుల కథనం ప్రకారం.. ఘ‌ట‌న జ‌రిగిన రోజు లుసిడి సాయంత్రం 6 గంటల సమయంలో బిల్డింగ్ సెక్యూరిటీ వద్దకు వచ్చాడు. 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. కానీ, 40వ అంతస్తులోని ఆ వ్యక్తి.. లుసిడి ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. సెక్యూరిటీ సిబ్బంది లుసిడిని ఆపేందుకు య‌త్నించ‌గా, అప్పటికే అత‌డు ఎలివేటర్‌లోకి వెళ్లిపోయాడు. అతడు 49వ ఫ్లోర్‌ నుంచి మెట్ల మార్గంలో పైకి వెళ్లినట్లు అక్కడి వారు చెబుతున్నారు. అత‌డి కోసం సెక్యూరిటీ సిబ్బంది గాలించిన‌ప్ప‌టికీ, భవనం పైకప్పుపై కనిపించలేదని పేర్కొన్నారు.  7.38 గంట‌ల‌ సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లోని పనిమనిషి చూసి పోలీసులకు కాల్‌ చేసింది. అనంతరం అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. 

Also Read: కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు

Published at : 21 Sep 2023 02:19 PM (IST) Tags: Austria British Man Death British Tourist Death stairway to heaven

ఇవి కూడా చూడండి

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

Australia Housing Crisis: ఆస్ట్రేలియాను ఆగం చేస్తున్న రెంటల్ క్రైసిస్, అద్దె ఇంటి కోసం నానా పాట్లు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

100-Day Cough: యూకేలో అలజడి రేపుతున్న 100 డే కాఫ్‌,దగ్గుతో సతమతం అవుతున్న బాధితులు

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

Gaza: పాలస్తీనా ప్రధానితో మాట్లాడిన జైశంకర్,గాజాలోని పరిస్థితులపై ఆరా

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

India Canada Tensions: ఖలిస్థాన్ వేర్పాటువాదంపై భారత్‌ స్ట్రాటెజీ ఏంటి? ఆరోపణల్ని ఎలా తిప్పికొట్టనుంది?

Look Back 2023 New Parliament Building : ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా - 2023లోనే అందుబాటులోకి కొత్త పార్లమెంట్ భవనం !

Look Back 2023 New Parliament Building :  ప్రజాస్వామ్య భారతానికి సరికొత్త చిరునామా  - 2023లోనే అందుబాటులోకి  కొత్త పార్లమెంట్ భవనం !

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!