Blue Origin New Shepard Launch: మరోసారి అంతరిక్షంలోకి బ్లూఅరిజన్స్ - ఈ సారి ఆరుగురు !
అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజన్స్ మరోసారి ఆరుగుర్ని అంతరిక్ష యానానికి తీసుకెళ్లింది.
Blue Origin New Shepard Launch: బ్లూ ఆరిజిన్ తన న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌకలో ( blue origin launch ) ఆరుగురు పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అంతరిక్ష నౌక సిబ్బందిని ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళుతుంది, కరామన్ లైన్ అధికారికంగా అంతరిక్షం ప్రారంభమయ్యే సరిహద్దుగా వరకూ తీసుకెళ్తోంది.నిజానికి గతంలోనే అంతరిక్షంలోకివెళ్లాల్సి ఉన్నా...( blue origin spacecraft ) అధిక గాలులు వీస్తాయని అంచనా వేయడంతో మార్చి 31కి ప్రయోగాన్ని వాయిదా వేశారు.
ఉక్రెయిన్ ఉద్రిక్తతల వేళ భారత్‌లో రష్యా విదేశాంగ మంత్రి పర్యటన
అమెరికాకు చెందిన తొలి వ్యోమగామి పేరిట బెజోస్ కంపెనీ బ్లూఆరిజన్స్ ను ( lue origin new shepard launch )ఏర్పాటు చేశారు. న్యూషెపర్డ్ నౌక ల ద్వారా పర్యాటకుల్ని ( space tourism ) అంతరిక్షంలోకి పంపుతున్నారు. కొన్నాళ్ల క్రితం ‘బ్లూ ఆరిజిన్’.. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు..దటీజ్ బ్లూ ఆరిజిన్ అన్నట్లుగా ఏకంగా నాలుగు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2021 జులైలో జెఫ్ బెజోస్ తో పాటు ఆయన టీమ్ అంతరిక్షయానం చేసి వచ్చారు. బ్లూఆరిజన్‌ను బెజోస్ 2000లో స్థాపించారు.
ఆ దేశానికి ఏమైంది? రోజుకు 10 గంటలు పవర్ కట్, ధరలు రాకెట్!
బ్లూ ఆరిజన్స్‌కు పోటీ కంపెనీ నౌక వర్జిన్ గలాక్టిక్‌తో పోలిస్తే న్యూషెపర్డ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో ఎలాంటి పైలెట్ ఉండడు. మొత్తం ఆటోమేటెడ్‌గానే నిర్వహణ జరిగుతుంది.2015 నుంచి బ్లూఆరిజన్ మానవ రహితంగా 15సార్లు అంతరిక్ష యాత్రలు నిర్వహించింది. బెజోస్ 20 కోట్ల డాలర్లను జాతీయ అంతరిక్ష మ్యూజియంకు విరాళమిచ్చారు. అలాగే యాత్రకోసం చేసిన బిడ్డింగ్ ద్వారా లభించిన మొత్తంలో సింహభాగాన్ని విద్యాసంస్థలకు, అంతరిక్ష సంస్థలకు విరాళంగా ఇచ్చారు.
లాస్ట్ ఓవర్లో ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్- క్లీన్ బౌల్డ్ అవుతారా? మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారా?
ఇప్పటి వరకూ 600 మంది అంతరిక్ష అంచులకు ( space tourism )వెళ్లివచ్చారు.త్వరలో భారీ స్థాయిలో యాత్రికులను నింగిలోకి తీసుకుపోయే న్యూగ్లెన్ అనే రాకెట్‌ను బ్లూఆరిజన్ రూపొందిస్తోంది.అన్నీ అనుకూలిస్తే చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌తో బ్లూమూన్ అనే నౌకను పంపాలన్నది కంపెనీ లక్ష్యం.మొత్తం ఫ్లైట్, లిఫ్ట్‌ఆఫ్ నుండి టచ్‌డౌన్ వరకు, కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. వాణిజ్య పరంగా అంతరిక్షయాత్రపై అంతకంతకూ కుబేరుల్లో ఆసక్తి పెరిగిపోతోంది.