(Source: Poll of Polls)
Afghanistan Mosque Blast: అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు- 10 మంది మృతి
అఫ్గానిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఐదు చోట్ల జరిగిన పేలుళ్లలో మొత్తం 10 మంది వరకు మృతి చెందారు.
అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కాబూల్‌తో సహా ఐదు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రార్థనా మందిరాల్లో జరిగిన ఈ పేలుళ్లలో 10 మంది వరకు మృతి చెందగా, 50 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలిస్తున్నారు.
#BREAKING Dozens of casualties from blast at Shiite mosque in Afghanistan: Taliban official pic.twitter.com/IxGZ6zN4Mx
— AFP News Agency (@AFP) April 21, 2022
పాఠశాలలో
పశ్చిమ కాబూల్‌లో ఏప్రిల్ 19న పేలుళ్ళు జరిగాయి. ఓ హైస్కూలులో జరిగిన ఈ పేలుళ్ళలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ పాఠశాల పరిసరాల్లో కొందరు షియా హజరా తెగకు చెందినవారు ఉన్నారు. వీరు మతపరమైన అల్ప సంఖ్యాకులు. వీరిపై సున్నీ ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఓ హైస్కూలులో రెండు పేలుళ్ళు జరిగినట్లు సమాచారం. షియా ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.
తాలిబన్ల పాలన
అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకుని సర్కార్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు తీసుకుంటోన్న నిర్ణయాలు అఫ్గాన్‌ను మరింత దిగజారేలా చేస్తున్నాయి. బాలికలు హైస్కూల్ విద్యను అభ్యసించేందుకు అనుమతించట్లేదని ప్రకటించారు.
ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు వీలుగా పలు సంస్కరణలు చేపడుతున్నట్లు తాలిబ్లను గతంలో ప్రకటించారు. ఇందులో భాగంగానే బాలికలకు ఉన్నత చదువులు అందించేందుకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. కానీ మళ్లీ మాట మార్చుతూ బాలికలను చదువుకు దూరం చేశారు. బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించట్లేదన్నారు. ఆరవ తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు చెప్పారు.
20 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరదించుతూ అఫ్గానిస్థాన్‌కు బైబై చెప్పి అమెరికా సైన్యం వెనుదిరిగింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ విధించిన ఆగస్టు 31 గడువు కంటే ఒక రోజు ముందే యూఎస్ దళాలు అఫ్గాన్‌ను వదిలి వెళ్లాయి. అప్గాన్‌లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అమెరికా చేతులు దులుపుకొని వెళ్లిపోవడంపై ప్రపంచదేశాలు ఆందోళన చెందాయి.
Also Read: UK PM Boris Johnson India Visit: తొలిసారి భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్- చరఖా తిప్పిన జాన్సన్
Also Read: NASA Perseverance Rover: మార్స్ డెల్టాలో వింత రంగుల్లో రాళ్లు- ఆ గ్రహంపై నిజంగా నీరు ఉండేదా?