(Source: ECI/ABP News/ABP Majha)
UK PM Boris Johnson India Visit: తొలిసారి భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్- చరఖా తిప్పిన జాన్సన్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తొలిసారి భారత పర్యటనకు వచ్చారు. గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం భారత్‌కు చేరుకున్నారు. బ్రిటన్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన బ్రిటన్ ప్రధానికి అహ్మదాబాద్ విమనాశ్రయంలో గుజరాత్ ముఖ్యమంత్రి, గవర్నర్ ఘన స్వాగతం పలికారు.
UK PM Boris* Johnson arrives in Ahmedabad, Gujarat. He is on a 2-day India visit pic.twitter.com/yzwlX5Dppg
— ANI (@ANI) April 21, 2022
సబర్మతి ఆశ్రమం
#WATCH | Prime Minister of the United Kingdom Boris Johnson visits Sabarmati Ashram, tries his hands on 'charkha' pic.twitter.com/6RTCpyce3k
— ANI (@ANI) April 21, 2022
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమంలో ఆయన చరఖా తిప్పారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సత్యం, అహింస వంటి మార్గాలతో ప్రపంచాన్ని మార్చిన మహనేత గాంధీ అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో మహత్మా గాంధీ శిష్యురాలిగా మారిన బ్రిటీష్ అడ్మిరల్ కూతురు మడేలిన్ స్లేడ్ (మీరాబెన్) ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానికి సబర్మతి ఆశ్రమం వారు బహుమతిగా అందజేశారు.
వాణిజ్య ఒప్పందాలు
గుజరాత్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో జాన్సన్ కాసేపట్లో భేటీ కానున్నాను. అనంతరం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని సందర్శించనున్నారు. అలాగే గాంధీనగర్‌లోని అక్షరధామ్ ఆలయానికి వెళ్లనున్నారు. శుక్రవారం దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. వీరు రక్షణ, దౌత్య, ఆర్థిక రంగాల్లో వ్యూహాత్మక బంధాలపై ప్రధానంగా చర్చిస్తారని సమాచారం.
బోరిస్ భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య బిలియన్ పౌండ్లు విలువ చేసే ఒప్పందాలు జరుగుతాయని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంలో ఇరు దేశాల మధ్య సరికొత్త శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాల ద్వారా 11వేల కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నట్లు చెప్పింది. దీని వల్ల ఇరు దేశాల బంధం మరింత బలపడుతుందని పేర్కొంది.
Also Read: Liver Disease Cases In US, Europe: పిల్లల్లో అంతుచిక్కని వ్యాధి- ఇలా సోకితే అలా కుప్పకూలుతున్నారు!