పొరపాటు డోర్‌బెల్ మోగించాడని నల్లజాతి యువకుడిపై కాల్పులు- అమెరికాలో వెలుగు చూసిన దారుణం
16 ఏళ్ల రాల్ఫ్ పాల్ యార్ల్ తన సోదరుడిని తీసుకురావడానికి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఇంటికి అడ్రెస్ సరిగా తెలియకపోవడంతో పొరపాటున వేరే వాళ్ల ఇంటి డోర్‌బెల్‌ను మోగించాడు.
అమెరికాలోని మిస్సౌరీలో దారుణం 85 ఏళ్ల శ్వేతజాతీయుడు 16 ఏళ్ల నల్లజాతీయుడిని తుపాకీతో కాల్చేశాడు. ప్రస్తుతం ఆ కుర్రాడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంటి డోర్‌బెల్‌ను పొరపాటున మోగించడమే ఆ కుర్రాడికి శాపమైంది.
16 ఏళ్ల రాల్ఫ్ పాల్ యార్ల్ తన సోదరుడిని తీసుకురావడానికి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఇంటికి అడ్రెస్ సరిగా తెలియకపోవడంతో పొరపాటున వేరే వాళ్ల ఇంటి డోర్‌బెల్‌ను మోగించాడు. ఆ ఇంటి నుంచి 85 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. వివరాలు అడిగి తెలుసుకుని తప్పుగా బెల్ మోగించాడని తన చేతిలో తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు.
శ్వేతజాతీయుడు జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాల్ఫ్ పాల్ యార్ల్ పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. ఈ కేసులో అరెస్టైన వ్యక్తి 24 గంటల్లోనే బెయిల్‌పై విడుదల కావడం నల్లజాతీయుల ఆగ్రహానికి కారణమైంది.
White Kansas City man, 85, charged in shooting of Black teen — 16-year-old Ralph Yarl was shot twice — once in the head — after knocking on the wrong door after being sent by his parents to retrieve his siblings from a friend’s house.
— Rob in Portland 💙 (@RobShiveley) April 17, 2023
https://t.co/k6YroE0US6@washingtonpost pic.twitter.com/bh9CJnjBF0
85 ఏళ్ల ఆండ్రూ లెస్టర్ రెండు నేరాలకు పాల్పడినట్టు క్లే కౌంటీ ప్రాసిక్యూటర్ జాకరీ థాంప్సన్ తేల్చారు. యార్ల్‌ను కాల్చడం ఒక నేరమైతే.. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటం మరో నేరంగా పరిగణిస్తున్నారు. అయితే $200,000 పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
ఆండ్రూ లెస్టర్ కాల్పుల్లో గాయపడ్డ యార్ల్ చాలా తెలివైన కుర్రాడిగా బాలుడి మేనత్త ఫెయిల్ స్పూన్‌మూర్ చెప్పారు. గోఫండ్‌మి క్యాంపెయిన్‌లో మాట్లాడిన ఆమె... కెమికల్ ఇంజనీరింగ్ చదవాలని ఆ కుర్రాడు కలలు కన్నట్టు వివరించారు.
ఓ నల్లజాతీయుడిపై శ్వేతజాతీయుడు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వైట్‌హౌస్ కూడా ఈ ఘటనపై స్పందించాల్సి వచ్చింది. అధ్యక్షుడు జో బిడెన్ యార్ల్‌తో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు వైట్ హౌస్ సోమవారం సాయంత్రం ప్రకటించింది "త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షించినట్టు తెలిపింది."
కాన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టాసీ గ్రేవ్స్ ఆదివారం రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఇది జాతి వైరంగా చూడలేమన్నారు. దీనిపై దర్యాప్తు వేగంగా సాగుతోందని చెప్పారు. జాతీ వైరం ఆరోపణలు ఉన్నట్టు ఈ కేసులో గుర్తించామన్నారు. వాళ్ల బాధను అర్థం చేసుకుంటామని ఆ దిశగాను విచారణ చేస్తామన్నారు.
జరిగిన ఘటనపై న్యూయార్క్ పోలీసులు మాట్లాడుతూ కాల్పుల్లో గాయపడిన యార్స్ స్నేహితురాలు కైలిన్ గిల్లిస్ చెప్పిన వివరాలు వెల్లడించారు. తన స్నేహితుల ఇంటికి వెళ్లే ప్రయత్నంలో పొరపాటున వేరే ఇంటికి డోర్ బెల్ నొక్కామన్నారు.
తాము రాంగ్ అడ్రెస్‌కు వచ్చామని తెలుసుకున్న ఆ ముగ్గురు స్నేహతులు వెళ్లిపోతున్న టైంలో నిందితుడు తుపాకి తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. మొదటి బులెట్ కైలిన్ గిల్లిస్ వాహనానికి తాకింది. రెండో బులెట్ యార్ల్ తలలోకీ దూసుకెళ్లింది.
అమెరికాలో తుపాకీ మోత కామన్‌గా మారిపోతోంది. రోజూ ఏదో ప్రాంతంలో తుపాకీ పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. దాదాపు 330 మిలియన్ల జనాభా ఉన్న యునైటెడ్ స్టేట్స్‌లో 400 మిలియన్ల తుపాకులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.