Radha Iyengar : బైడెన్ జట్టులో ప్రవాస భారత మహిళలకు కీలక బాధ్యతలు - ఎవరెవరికి అంటే ?
ప్రవాస భారతీయ మహిళల పనితీరు బైడెన్‌ను ఆకర్షిస్తోంది. కీలకమైన పదవులు వారికి అప్పగిస్తున్నారు.
Radha Iyengar to top Pentagon position : అమెరికాలో భారత సంతతికి చెందిన మరో మహిళకు ఉన్నత స్థానం లభించనుంది. పెంటగాన్ ఉన్నత స్థానానికి ఇండో-అమెరికన్ రాధా అయ్యంగార్ ప్లంబ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు. తన పరిపాలనలో కీలక నేతల నిమిత్తం పలువుర్ని బైడెన్ ( Biden ) నామినేట్ చేయగా.. అందులో రాధా ఒకరు. ఆమెను అమెరికా ( America ) డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్‌లో భాగంగా అక్విజిషన్ అండ్ సస్టెయిన్‌మెంట్ కోసం డిప్యూటీ అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌కు రాధా పేరును నామినేట్ చేశారు.
పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఫర్లేదు వచ్చినా తగ్గుతుంది- HIVకి ఔషధం వచ్చిందోచ్!
అమెరికాలో ప్రముఖ వ్యక్తి రాధా అయ్యంగార్
ఎకనామిక్స్‌లో ఎంఎస్, పిహెచ్‌డి పూర్తి చేసిన ఆమె లండన్ స్కూల్ ఆప్ ఎకనామిక్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేశారు. రాధా అయ్యంగార్ ప్రస్తుతం డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు. చీఫ్‌స్టాఫ్‌గా నియమకానికి ముందు.. ఆమె గూగుల్‌లో ( Google ) ట్రస్ట్ అండ్ సేఫ్టీ కోసం రీసెర్చ్ అండ్ ఇన్‌సైట్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆమె గతంలో ఫేస్‌బుక్ ( Face Book ) లో పాలసీ అనాలసిస్ గ్లోబల్ హెడ్‌గా వ్యవహరించారు.
అంతర్జాతీయ భద్రతా సమస్యలపై ఎక్కువ అవగాహన
అధిక ప్రమాదం, అధిక హాని భద్రత, క్లిష్టమైన అంతర్జాతీయ భద్రతా సమస్యలపై దృష్టిసారించేవారు. రాధా గతంలో రాండ్ కార్పొరేషన్‌లో సీనియర్ ఎకనామిస్ట్‌గా వ్యవమరించారు. డిఫెన్స్ విభాగం, ఎనర్జీ విభాగం, వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో జాతీయ భద్రతా సమస్యలపై అనేక పదవులను అధిరోహించారు.
ఏలియన్స్‌ను గుర్తించిన చైనా - ఆ టెలిస్కోప్‌లో వాళ్లేం చేస్తున్నారో కూడా చూస్తోందట !
మరో కీలక పదవిలో అరతి ప్రభాకర్
త్వరలోనే మరో కీలక పదవిలో ఆరతి ప్రభాకర్ అనే ప్రవాస భారతీయురాలు నియమితులయ్యే అవకాసం ఉంది. సైంటిఫిక్ అడ్వయిజర్‌గా 63 ఏళ్ల ఆరతిప్రభాకర్‌ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరింది. రెండు, మూడు రోజుల్లో నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో పుట్టిన అరతిప్రభాకర్ అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడ్డారు. రక్షణ రంగానికి చెందిన ఎన్నో కీలకమైన పదవులు అధిరోహించారు.