Bangladesh Protests : ఉస్మాన్ హాదీ తీవ్రవాది, భారత్‌ను రెచ్చగొడుతున్న యూనస్ ప్రభుత్వం; బంగ్లాదేశ్ మాజీ విద్యామంత్రి సంచలన ఆరోపణలు
Bangladesh Protests : బంగ్లాదేశ్‌లో ఉస్మాన్ హాది మరణాన్ని అల్లర్లకు యూనస్ ప్రభుత్వం కారణమని బంగ్లాదేశ్ మాజీ మంత్రి ఆరోపించారు. భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు.

Bangladesh Protests : గతేడాది జూలైలో బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటులో కీలక నాయకుల్లో ఒకరైన షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. రాజధాని ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి, దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో, డిసెంబర్ 18న అర్ధరాత్రి తర్వాత నిరసనకారులు బంగ్లాదేశ్ మాజీ విద్యా మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి ఇంటికి నిప్పు పెట్టింది.
భారతదేశాన్ని రెచ్చగొట్టాలని యోచిస్తున్న యూనస్ ప్రభుత్వం: మొహిబుల్ హసన్
న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ ఎన్నికలను ఆలస్యం చేయడానికి అశాంతిని సృష్టిస్తోందని మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఉద్యమకారులను జిహాదీ భావజాలం కలిగిన తీవ్రవాదులుగా ఆయన అభివర్ణించారు. "ఉస్మాన్ హాదీ మరణాన్ని అల్లర్లు రేపడానికి, ఎన్నికలను ఆలస్యం చేయడానికి ఒక సాకుగా ఉపయోగిస్తున్నారు. భారత రాయబార కార్యాలయంపై దాడి చేయడం వెనుక భారతదేశాన్ని రెచ్చగొట్టి, అరాచకాన్ని సృష్టించాలనే ఉద్దేశ్యం ఉంది" అని మొహిబుల్ హసన్ అన్నారు.
#WATCH | On the protests in Bangladesh following the death of Osman Hadi, Mohibul Hasan Chowdhury, a former minister in the Hasina cabinet, says, "It is a pattern that has been planned and now the plan is in action. It is a state-sponsored activity...It is a pattern, and they… pic.twitter.com/ANc2tuXZEI
— ANI (@ANI) December 19, 2025
'యూనుస్ ప్రభుత్వమే జనాలను రెచ్చగొట్టింది'
"ఉస్మాన్ హాదీ మరణానికి భారత హైకమిషన్‌తో సంబంధం ఏమిటి? వారు భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని కోరుకున్నారు. యూనస్ ప్రభుత్వమే ప్రజలను రెచ్చగొట్టింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు పైనుంచి రెచ్చగొడుతున్నారు, ఆపై పోలీసులకు లేదా సైన్యానికి మౌనంగా ఉండమని చెబుతున్నారు" అని అన్నారు.
ఉస్మాన్ హాదీ ఒక తీవ్రవాది: మొహిబుల్ హసన్
షేక్ హసీనా మంత్రివర్గంలో మాజీ మంత్రి అయిన మొహిబుల్ హసన్ చౌదరి మాట్లాడుతూ, "ఉస్మాన్ హాదీ ఒక తీవ్రవాది, అతను ఇతరుల రక్తాన్ని చిందించాలని మాట్లాడేవాడు. ఈ సాకుతో యూనస్ ప్రభుత్వం ఇతర తీవ్రవాద రాజకీయ పార్టీల సహాయంతో అతని తీవ్రవాదులను, వారి అనుచరులను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించింది. మొహమ్మద్ యూనస్ ప్రధాన లక్ష్యం ఎన్నికలను ఆలస్యం చేయడం. భారత హైకమిషన్‌పై దాడి తర్వాత ఢిల్లీ స్పందిస్తుందని వారు ఆశించారు." అని అన్నారు.
"వీరు జిహాదీ మనస్తత్వం కలిగిన తీవ్రవాదులు, వీరు కొంతకాలం అధికారాన్ని చేపట్టారు, ఇప్పుడు అది తమ పని కాదని గ్రహించిన తర్వాత, వారు కేవలం రాజకీయాల్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఈ వ్యక్తులు వీలైనంత వరకు అరాచకాన్ని, అస్తవ్యస్తతను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఆయన అన్నారు.





















