Bangkok News: 21 ఏళ్లుగా భార్య శవంతో సహజీవనం- చివరికి ఏం చేశాడంటే?
Bangkok News: భార్య శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా 21 ఏళ్ల పాటు ఇంట్లోనే దాచుకున్నాడు ఓ వ్యక్తి.
Bangkok News: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన 72 ఏళ్ల చాన్ జన్వాచకల్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాడు. మరి ఆయన చేసిన పని అలాంటిది మరి. 21 ఏళ్లుగా చాన్ చనిపోయిన తన భార్య శవంతో ఇంట్లోనే సహజీవనం చేశాడు.
ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. చాన్ తన భార్య శవాన్ని 21 సంవత్సరాలు ఇంట్లోనే దాచుకున్నాడు. చివరికి భయమేసి ఓ ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పి అంత్యక్రియలు నిర్వహించాల్సిందిగా కోరాడు.
ఏం జరిగింది?
బ్యాంకాక్‌కు చెందిన చాన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవాడు. 2001లో ఆయన భార్య అనారోగ్య కారణాల వల్ల చనిపోయింది. ఎంతగానో ప్రేమించి తన భార్య చనిపోయేసరికి అతనికి ఏం చేయాలో తెలియలేదు. ఆమెకు అంత్యక్రియలు జరపకుండా అలానే ఉండిపోయాడు.
కొడుకులు అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా చాన్ వద్దని వారించాడు. ఆమెను వదలి ఉండలేనని, తమది శాశ్వతమైన ప్రేమ అని వాదించాడు.
ఆమె శవాన్ని ఓ శవపేటికలో పెట్టి ఇంట్లోనే దాచి పెట్టుకున్నాడు. కొన్ని రోజులకు ఆయన ప్రవర్తనతో విసుగు వచ్చి ఇద్దరు కొడుకులూ ఆయనని వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతనొక్కడే మృతదేహంతో ఉంటున్నాడు. అయితే చాన్ మతిస్థిమితం లేనివ్యక్తా అంటే అదీ కాదు.. వృత్తిరీత్యా వైద్యుడు. అంతేకాదు చాన్.. థాయిలాండ్ ఆర్మీలోనూ సేవలందించారు.
21 ఏళ్ల తర్వాత
చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించకపోతే ఏమైనా అవుతుందేమోనని 21 ఏళ్ల తరువాత అతనికి భయం వేసింది. దీంతో అతనికి తెలిసిన ఓ ఛారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. ఇది విని షాకైన ట్రస్ట్.. మొత్తానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. శవపేటికలో ఉన్న మృతదేహానికి వారు అంత్యక్రియలు నిర్వహించారు.
భార్య మృతదేహాన్ని 21 ఏళ్లపాటు ఇంట్లోనే ఉంచుకున్న తాను ఇక బతికి ఉన్నంత కాలం ఆమె చితాభస్మంతో కలిసుంటానని చాన్ చెబుతున్నాడు. 21 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు వ్యవహారాన్ని ఛారిటబుల్ ట్రస్ట్ వాళ్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అవాక్కయ్యారు. అన్నిరోజుల పాటు శవంతో ఆయన జీవించాడోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Sri Lanka Crisis: నిరసనకారుల 'లంకా దహనం'- రహస్య ప్రాంతానికి పారిపోయిన మాజీ ప్రధాని!