By: ABP Desam | Updated at : 21 Feb 2023 09:11 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ డొనేషన్ ట్రెండ్ బాగా పెరిగింది. చాలా మంది ఈ పని చేస్తున్నారు. సాధారణంగా వీర్యదాత గురించి వివరాలు ఎవరూ బయటకు చెప్పరు. అసలు ఆలాంటి వ్యక్తులు ఉంటారా అనేలా ఉంటుందీ ప్రక్రియ.
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ వింత ఘటనతో అసలు వీర్యదాత హెడ్‌లైన్‌గా మారిపోయాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో ఆయనే టాప్ ట్రెండింగ్ టాపిక్. సెటైర్లు, మీమ్స్‌తోపాటు ఆయన సమస్యలపై కూడా చర్చ నడుస్తోంది.
ఆ వీర్య దాత 60 మంది పిల్లలకు తండ్రి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ 60 మంది పిల్లల ముఖం అచ్చం ఒకేలా ఉంది. అంటే అందరూ ఒకే పోలికలతో ఉన్న వారు కావడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. ఒకేలా ఉన్న ఈ పిల్లలు ఒక పార్టీలో కలిశారు. వాళ్లను ఒక్కసారిగా చూసిన వాళ్లంతా షాక్‌కి గురయ్యారు. ఇలా ఎలా సాధ్యమని మాట్లాడుకున్నారు.
60 మంది పిల్లలంతా ఒకేలా ఎలా ఉన్నారని అక్కడే ఉన్న వాళ్లు ఆరా తీస్తే వాళ్ల అసలు విషయం తెలిసింది. వాళ్ల తండ్రి ఒకడే అని తేలింది. అంటే అసలు తల్లిదండ్రులు వేరే ఉన్నప్పటికీ వాళ్లకు వీర్యదానం చేసింది మాత్రం ఒకే వ్యక్తి. పిల్లలందరి ముఖాలు ఒకేలా ఉండటం చూసిన వాళ్ల తల్లిదండ్రులు కూడా గుండెపోటు వచ్చినంత పనైంది.
ఈ వ్యక్తి తన వీర్యాన్ని ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి చెందిన పలువురికి దానం చేసినట్లు నివేదిక తెలిపింది. ఒకేసారి ఒక దాత వీర్యాన్ని మాత్రమే ఉపయోగించాలని నియమం చెబుతుంది. కాని అతను తన గుర్తింపును దాచిపెట్టి నాలుగు వేర్వేరు పేర్లతో అందులో రిజిస్టర్ అయ్యాడు. అలా అవసరమైన వాళ్లందరికీ తన వీర్యాన్ని ఇచ్చుకుంటూ పోయాడు. దీని గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు పార్టీ మూలంగా అసలు విషయం వెలుగు చూసింది.
ఇలాంటి స్పెర్మ్ డోనర్ మోసాలు చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉంటాయి. కానీ దాని పర్యవసానాలు ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. ఇప్పుడే తొలిసారిగా డోనర్ తప్పు కారణంగా సరికొత్త సమస్య బయటకు వచ్చింది. వేర్వేరు ప్రాంతాల్లో పుట్టిన ఈ 60 మంది పిల్లలు పార్టీ కారణంగా ఒక చోటకు చేరారు. అప్పుడే ఆ పిల్లల ముఖాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్లందరికీ ఒకేరకమైన ముఖం ఉందని గుర్తించారు. ఇది చూసిన ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా నివ్వెరపోయారు. అక్కడకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు మిగతావారితో ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే అందరి ముఖాలు ఒకేలా కనిపించడం షాకింగ్ గా ఉంది.
పిల్లలను ఒకేరకమైన పోలికలతో ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. అప్పుడుగాని స్పెర్మ్ డోనర్ చేసిన బాగోతం బయటపడలేదు. వేర్వేరు పేర్లతో వేర్వేరుగా రిజిస్టర్ అయిన ఆ వ్యక్తి వీరాన్యాన్ని దానం చేయడంతోనే ఈ సమస్య వచ్చిందని తేలింది.
Also Read: ఇలాంటి వ్యాయామాలు చేస్తే టెస్టోస్టెరాన్ స్ఠాయిలు పడిపోతాయి
Also Read: ముద్దు ప్రేమని పెంచడమే కాదు - ఆరోగ్యాన్నీ పెంచుతుంది
చికెన్ మంచూరియాపై న్యూయార్క్ టైమ్స్ హాట్ ట్వీట్- మండిపడుతున్న ఇండియన్ నెటిజన్స్ ?
పశువైద్యుడు గుర్తించలేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది
చంద్రుడిపై గాజు గోళాల్లో నీరు - పరిశోధనల్లో వెల్లడి
Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి
Five Planets Alignment: రాత్రికి ఆకాశంలో అద్భుతం - ఆకట్టుకోనున్న పంచగ్రహ కూటమి..!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!