అన్వేషించండి

Myanmar Junta Attack: మయన్మార్ లో సైన్యం బాంబు దాడి - చిన్నారులు, మహిళలు సహా 100 మంది మృతి

మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియాలో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడి చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.

Myanmar millitary junta aircraft attack: మయన్మార్‌ పరిస్థితి అదుపు తప్పుతోంది. మయన్మార్‌లోని సెంట్రల్ ఏరియా సాగెయింగ్ లోని కాంట్ బాలు టౌన్ షిప్ లో మంగళవారం సైన్యం జుంటా బాంబు దాడులు చేసింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంపై ఆర్మీ ఎయిర్ స్టైక్ చేయగా కనీసం 100 మంది మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సగయింగ్ ప్రాంతంలోని కాంత్ బాలు టౌన్‌షిప్‌పై మయన్మార్ సైన్యం జుంటా బాంబు దాడి చేయడంతో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

జుంటా ఎయిర్ క్రాఫ్ట్ నుంచి నిరసనకారులపై మయన్మార్ సైన్యం రెండు బాబులు జారవిడిచిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఆర్మీ జరిపిన ఈ బాంబు దాడిలో ‘చాలా మంది అమాయకులు మరణించారు. వీరిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు అందులోనూ గర్భిణీలు ఉన్నారని నేషనల్ యూనిటీ గవర్నమెంట్ (NUG) యొక్క కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణించింది. ఇది దారుణమైన ఘటన అని సైన్యం చేసిన బాంబు దాడిని తీవ్రంగా ఖండించింది. స్థానికంగా కొత్త ఆఫీసు ప్రారంభించనున్న సందర్భంగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడిన సమయంలో వారిపై జుంబా యుద్ధ విమానాల నుంచి బాంబులు వేసి దాడి జరిపారని మరికొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

ఫిబ్రవరి 2021లో మిలటరీ తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి మయన్మార్ లో వేలాదిగా ప్రజలు మరణించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని ఆర్మీ పదవి నుంచి తొలగించింది. విచారణ పేరుతో ఆమెకు ఏకంగా 33 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. సూకీకి మద్దతు తెలిపిన వారిపై మయన్మార్ సైన్యం దాడులకు పాల్పడుతోంది. ఎంతో మంది జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, పౌర హక్కుల కార్యకర్తలను ఖైదు చేసింది సైన్యం. మయన్మార్ లో జరుగుతున్న ఘటనల్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది.

ఆగ్నేయాసియా దేశంరెండేళ్లుగా అస్థిరతతో అల్లాడిపోతోంది. ప్రస్తుతం అక్కడ ఆహారం సరిగా దొరకడం లేదు. ఇంధనం కొరత, ఆహార పదార్థాలు అందుబాటులో ఉండవు. అంగ్ సాన్ సూకీ నుంచి ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్లడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది.  పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) సభ్యుడు రాయిటర్స్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్థానికంగా ఓ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిపై యుద్ధ విమానాలు బాంబు దాడులు చేయడంతో పాటు కాల్పులు జరిపాయని తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget