Antibiotics Resistance: వచ్చే పాతికేళ్లలో 4 కోట్ల మరణాలు- ప్రమాదం అంచున భారత్, పాక్
Lancet Journal | యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్‌తో వచ్చే పాతికేళ్లలో భారత్ సహా ఉపఖండంలో కోట్ల మంది మృత్యువాత పడతారని లాన్సెట్ జర్నల్ అధ్యయనంలో పేర్కొంది.
Antibiotics Resistance will kill millions: శరీరంలో నలతగా ఉంటే యాంటీబయోటిక్స్ వాడడం మనకు అలవాటు. బ్యాక్టీరియాపై అవి దాడి చేసి మనల్ని అనారోగ్యం నుంచి కాపాడడంలో ఈ యాంటిబయోటిక్స్ కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఒక వేళ అవి విఫలమైతే..? బ్యాక్టీరియాలు, వైరస్‌లు లేదా ఇతర పరాన్న జీవులను చంపడంలో ఈ యాంటీబయోటిక్స్ విఫలం అయితే.. అంటే వాటిలో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగితే ఏంటి పరిస్థితి..? ఆ బ్యాక్టీరియాలు ఆ మనిషిని చంపేస్తాయి. నిజానికి ఇదే జరిగింది. 1990 నుంచి 2021 వరకు జరిగిన పరిశోధనల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది మృత్యువాత పడినట్లు లాన్సెట్ జర్నల్ కథనం పేర్కొంది.
మరణాలు కంట్రోల్ చేయాలంటే ఈ రంగంలో పరిశోధనలు భారీగా చేపట్టాలని కథనం తెలిపింది.
గతమే ఇంత భయంకరంగా ఉందంటే భవిష్యత్ ఇంకా భయానకం అంటున్న పరిశోధన:
New data released today in @TheLancet shows that without urgent action, antimicrobial resistance could kill 39 million people by 2050.
— Prof. Dame Sally Davies (@UKAMREnvoy) September 17, 2024
Deaths and inequities from the global antibiotic emergency are increasing and now is the time to take urgent action.https://t.co/O91bRl2G91 pic.twitter.com/tTSsaO5yOo
సమీప భవిష్యత్‌లో అంటే 2025 నుంచి 2050 మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా మరో నాలుగు కోట్ల మంది వరకూ ఈ బయోటిక్స్ రెసిస్టెన్స్‌కు బలికానున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. దక్షిణాసియాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. అందులోనూ ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో లక్షలాది మందిపై ఈ బయోటిక్స్ రెసిస్టెన్స్ కత్తి వేలాడబోతోందని తెలిపారు. వచ్చే పాతికేళ్ల వ్యవధిలో దక్షిణాసియా దేశాల్లో దాదాపు కోటీ 18 లక్షల మంది ఈ యాంటీబయోటిక్స్ రెసిస్టెన్స్‌తో చనిపోతారని ప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో 50 కోట్ల మందిపై పరిశోధన అనంతరం పరిశోధకులు లాన్సెంట్ జర్నల్‌లో ప్రచురించారు. వాస్తవానికి ఈ టీకాలు కానీ, యాంటీబయోటిక్స్ కానీ శరీరంలోని బ్యాక్టీరియాలను, వైరస్‌లను, ఫంగిలను చంపడానికి తయారు చేసినప్పటికీ.. వాటిని సమర్థంగా ఎదుర్కొనే శక్తి బ్యాక్టీరియాలతో పాటు వైరస్‌లు అభివృద్ది చేసుకుంటున్నట్లు తేలింది.
తూర్పు దక్షిణ ఆసియా ప్రాంతాలతో పాటు సబ్ సహరన్ ఆఫ్రికాలోనూ ఈ తరహా సమస్య ఉంటున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. గడచిన 70 ఏళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ తరహా యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్ బగ్స్‌లో 80 శాతం మేర పెరిగినట్లు తేలిందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సమీప భవిష్యత్‌లో వయసు మళ్లిన వారు ఎక్కువగా ఈ తరహా మరణాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఇదే సమయంలో చిన్నారుల్లో ఈ తరహా మరణాల సంఖ్య 50 శాతం మేర తగ్గిపోవడం మంచి విషయంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు.. భవిష్యత్‌లో మరింత సమర్థంగా యాంటిబయోటిక్స్ పనిచేసేలా మార్గాలు వెతకాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. యువకుల్లో మాత్రం ఈ తరహా మరణాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.
హెల్త్ కేర్ 2019లో యాంటిబయోటిక్స్ రెసిస్టెన్స్ డెత్స్ దాదాపు కోటీ 20 లక్షలుగా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధులతో చనిపోయిన వారి సంఖ్య కంటే ఇదే ఎక్కువని తెలిపారు. మరో ఐదు లక్షల మంది యాంటీబయోటిక్స్ విఫలమై ఇతర వ్యాధుల బారిన పడి చనిపోయినట్లు తెలిపారు. సహా యాంటిబయోటిక్స్‌లో పరిశోధనలు పెంచడం ద్వారా వచ్చే పాతికేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 9న్నర కోట్ల మంది ప్రాణాలు కాపాడొచ్చని చెప్పారు. ప్రపంచ దేశాలు ఆ దిశగా దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు సూచించారు.