US President News: ప్రచార వ్యూహకర్తకు కీలక బాధ్యతలు- సూసీ వైల్స్‌ను వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించిన ట్రంప్
Donald Trump : వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వైల్స్‌ను ప్రకటించడంతో ఈ పదవిలో పనిచేసే తొలి మహిళగా వైల్స్ ఉంటారు. ఆమె ఎన్నికల ప్రచారాల్లో సహాయం చేశారని పేర్కొన్నారు.

US Elections : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ప్రచార వ్యూహకర్తల్లో ఒకరైన సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపిక చేసుకున్నారు. ట్రంప్ ఇటీవలి ఎన్నికల విజయంలో వైల్స్ కీలక పాత్ర పోషించారు. జనవరి 20న వైట్ హౌస్‌కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నందున పరిపాలనలో కీలక పదవి కట్టబెట్టారు.
డొనాల్డ్ చేసిన ఈ ప్రకటనతో వైల్స్ వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించే మొదటి మహిళ అవుతారు. 2016, 2020, 2024 ఎన్నికల ప్రచారాల్లో ఆమె సహాయం చేశారని గుర్తించారు ట్రంప్
సూసీ వైల్స్ ఎవరు?
"అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాలు సాధించడంలో సూసీ వైల్స్ సహాయం చేశారు. నా మునుపటి అన్ని ప్రచారాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు" అని ట్రంప్ అన్నారు. ఆమెను "స్మార్ట్, ఇన్నోవేటివ్, టఫ్, విశ్వవ్యాప్తంగా గౌరవించే వ్యక్తి" అని ప్రశంసించారు. ఇప్పుడు కొత్తగా ఎంపికైన పదవికి కూడా వైల్స్ గౌరవం తెస్తారనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు.
రాయిటర్స్ నివేదిక ప్రకారం... వైల్స్‌ను నమ్మదగిన వ్యూహకర్తగా ట్రంప్ పరిగణిస్తారు. తన ప్రచార విజయంలో ఆమెది కీలక పాత్రగా అంగీకరించారు. ఇప్పుడు ఈ కొత్త హోదాలో వైల్స్ వైట్ హౌస్‌లోని అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తారు. ట్రంప్ షెడ్యూల్‌ను చూసుకుంటారు. సిబ్బందికి బాధ్యతలు అప్పగిస్తారు. ప్రభుత్వంలోని ఇతర శాఖలతో వారధిగా ఉంటారు.
వైల్స్ 1980 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రోనాల్డ్ రీగన్‌కు, అతని 2018 విజయంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు సహాయం చేశారు. రిపబ్లికన్ వ్యూహకర్త ఫోర్డ్ ఓ కానెల్ సూసీని తన వ్యూహాలతో బలమైన నాయకురాలిగా అభివర్ణించారు. ఇన్నిరోజులు తెరవెనుక ఉండి కథను నడిపించిన ఆమెను ట్రంప్ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చారు.
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్లాన్
డెమొక్రాట్ కమలా హారిస్‌పై భారీ విజయం సాధించిన తర్వాత, ట్రంప్ ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో ఉంటున్నారు. పరిపాలనాలో ఎవరెవరు ఉండాలనే విషయంపై సలహాలు తీసుకుంటున్నారు. ట్రంప్ మాజీ డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ డైరెక్టర్ బ్రూక్ రోలిన్స్, మాజీ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీను వేరేవేరు పదవుల్లో ఉంచాలని భావిస్తున్నారు.
Also Read: ట్రంప్ గెలుపుతో భారత్‌కు లాభమా ? నష్టమా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

