By: ABP Desam | Updated at : 07 May 2022 03:56 PM (IST)
బురఖా ఎలా ఉండాలో ఆదేశాలు జారీ చేసిన తాలిబన్లు
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు తాలిబన్లు. ఇప్పటికే అనేక ఆంక్షలు పెట్టగా తాజాగా.. మరో డిక్రీ జారీ చేశారు. దాని ప్రకారం మహిళలు బయటకు శరీరాన్ని పూర్తిగా కప్పివేసే బురఖా ధరించి రావాలి. ఇప్పటి వరకూ అలాగే వచ్చేవారు. అయితే ఎదురుగా నడుస్తూంటే... దారి కన్పించాలన్న ఉద్దేశంతో కళ్లను మాత్రం ఓపెన్‌గా ఉంచుకునేవారు. ఇప్పుడు ఆ కళ్లను కూడా మూసేయాలని తాలిబన్లు ఆదేశించారు.
శ్రీలంకలో వెనక్కి తగ్గని ఆందోళనకారులు- మరోసారి దేశవ్యాప్తంగా ఎమెర్జెన్సీ
తల పైభాగం నుంచి పాదాల వరకు ఉండే బురఖా సంప్రదాయబద్ధమైనదని, ఇది ధరించడం గౌరవప్రదంగా ఉంటుందని తాలిబన్ చీఫ్, ఆఫ్ఘనిస్థాన్ సుప్రీంనేత హిబాతుల్లా అఖుంద్ జాదా ఆదేశాలు జారీ చేశారు. మరీ వృద్ధులు కాని వారు, మరీ చిన్నవయసు కాని స్త్రీలు తమ ముఖాన్ని తప్పక దాచుకోవాలని, వారి కళ్లు మాత్రమే కనిపించేలా దుస్తులు ఉండాలని, షరియా చట్టం ఇదే చెబుతోందని అఖుంద్ జాదా పేర్కొన్నారు. స్త్రీలు పర పురుషులను కలిసినప్పుడు వారిలో రెచ్చగొట్టే భావనలను ఈ బురఖా నివారిస్తుందని ఆయన చెబుతున్నారు.
జో బైడెన్ సంచలన నిర్ణయం- హై ప్రొఫైల్ పదవికి ఓ LGBTకి ఛాన్స్
ఎదుటగా దారి కన్పించడానికి కళ్ల ప్రదేశంలో కాస్త పారదర్శకమైన వస్త్రం ఉండవచ్చని తాలిబన్లు రిలీఫ్ ఇచ్చారు. అసలు తాలిబన్ల ఉద్దేశం మహిళల్ని బయటకు రాకుండా చేయడం. ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే మహిళలు బయటికి రావాలని, లేని పక్షంలో వారు ఇంట్లో ఉండడమే మంచిది అని తాలిబన్ల చీఫ్ నిర్మోహమాటంగా చెబుతున్నారు. అఖుంద్ జాదా జారీ చేసిన హుకుంను కాబూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్ వర్గాలు బహిరంగంగా విడుదల చేశాయి. ఈ ఆర్డర్‌ను అతిక్రమిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో అక్కడి వారికి తెలుసు. అందుకే సైలెంట్ అయిపోయారు.
మస్క్ మాస్టర్ ప్లాన్- మనోళ్లను తప్పించేస్తాడా? అంత ఈజీ కాదుగా!
తిరుగుబాటుతో అధికారం చేపట్టిన తాలిబన్లు మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో రెండు దశాబ్దాల కింద ఉన్న తాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో తాలిబన్లు పాలనలో టీవీలు, సినిమాలు, వంటి ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాములను అనైతికం అంటూ తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. గతంలో టీవీలు చూస్తూ కనిపించిన వారికి బహిరంగంగానే శిక్షలు వేశారు. ఇప్పుడు కూడా ఒక్కో అడుగు అటు వైపే వేస్తున్నారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
Drone Shot Down: అమర్నాథ్ యాత్రపై ఉగ్ర కుట్ర, బాంబులతో వచ్చిన డ్రోన్‌ను కూల్చేసిన సైన్యం
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి