నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ బాల్య వివాహాలు జరగనివ్వను - హిమత బిశ్వ శర్మ
Himanta Biswa Sarma: అసోంలో బాల్య వివాహాలను కచ్చితంగా అడ్డుకుని తీరతామని హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.
CM Himanta Biswa Sarma: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాల్య వివాహాలను జరగనివ్వనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పైనా విరుచుకు పడ్డారు. Assam Muslim Marriages and Divorces Registration Act, 1935 ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే AIUDFతో పాటు కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుపట్టినా అందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫలితంగా..ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. చట్టంలో కొన్ని సవరణలు చేసుంటే సరిపోయేదని, చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ తేల్చి చెబుతోంది. ఈ సమయంలోనే హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు దాదాపు పది నిముషాల పాటు వాకౌట్ చేశాయి.
"నేను చెప్పే మాట అందరూ వినండి. నేను బతికున్నంత వరకూ అసోంలో బాల్య వివాహాలు జరగనే జరగవు. కచ్చితంగా వాటిని అడ్డుకుని తీరతాం. ముస్లిం వర్గానికి చెందిన చిన్నారుల జీవితాలు నాశనమైపోతున్నాయ. ఇదంతా మీరు చేసిందే (కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ). ఈ వివాహాలను అడ్డుుకునేంత వరకూ ఊరుకోం. 2026 అసెంబ్లీ ఎన్నికల లోపే ఇదంతా జరుగుతుంది"
- హిమంత బిశ్వ శర్మ, అసో ముఖ్యమంత్రి
कांग्रेस के लोग सुन लें, जब तक मैं, हिमंत बिस्वा सरमा ज़िंदा हूं, तब तक असम में छोटी बच्चियों का विवाह नहीं होने दूँगा। आप लोगों ने मुस्लिम समुदाय की बेटियों को बर्बाद करने की जो दुकान खोली है उन्हें पूरी तरह से बंद किए बिना हम चैन से नहीं बैठेंगे। pic.twitter.com/3yXLi4C23o
— Himanta Biswa Sarma (@himantabiswa) February 26, 2024
ఇదే కారణమట..
ఇప్పటికే Uniform Civil Code (UCC) అమలుకు సిద్ధమవుతున్న అసోం ప్రభుత్వం...అందులో భాగంగానే ముస్లిం వివాహాల చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. అసోం మంత్రి జయంత మల్లా బరువా మీడియాకి ఈ విషయం వెల్లడించారు. యూసీసీ అమలులో ఇది మొదటి అడుగు అని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లు అసోం ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కింద వివాహాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, విడాకులూ ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికీ ఆ పాత చట్టం పరిధిలోనే వివాహాలు రిజిస్టర్ చేస్తున్న వాళ్లని జిల్లా కమిషనర్‌లు అదుపులోకి తీసుకుంటారని మంత్రి జయంత మల్లా స్పష్టం చేశారు. వాళ్లకి రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం బాల్య వివాహాలను అడ్డుకునేందుకే ఈ పాత చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేస్తోంది.
Also Read: అమెరికాలో ఫేక్ లవ్ స్కామ్ వలలో చిక్కిన భారతీయ యువతి, రూ. 4 కోట్లు గల్లంతు