అన్వేషించండి

అమెరికాలో ఫేక్‌ లవ్ స్కామ్‌ వలలో చిక్కిన భారతీయ యువతి, రూ. 4 కోట్లు గల్లంతు

Fake Love Scam: అమెరికాలో ఓ యువతి ఫేక్ లవ్ స్కామ్‌ బారిన పడి రూ.4 కోట్లు పోగొట్టుకుంది.

Fake Love Scam in US: అమెరికాలో ఓ ఇండియన్ ఐటీ ఎంప్లాయ్‌ Fake Love స్కామ్‌ వలలో చిక్కుకుని రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడు. పెన్సిల్వేనియాలోని ఫిలాడెల్ఫియాలో ఉంటున్న శ్రేయా దత్త ఈ స్కామ్‌లో చిక్కుకున్నారు. సేవింగ్స్ ఖాతాలో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఈ cryptocurrency romance fraud లో చాలా మంది బాధితులవుతున్నారు. మాయ మాటల్లోకి దింపి ప్రేమిస్తున్నట్టు నటించి చివరకు ఫేక్ ఇన్‌వెస్ట్‌మెంట్ స్కీమ్స్ గురించి చెబుతారు. అందులో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా వలలోకి దింపుతారు. శ్రేయా దత్త ఇలాగే మోసపోయింది. Hinge డేటింగ్ యాప్‌ ద్వారా ఓ వ్యక్తితో శ్రేయా దత్తాకి పరిచయం ఏర్పడింది. ఆ తరవాత ఇద్దరూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్నారు. ఆ తరవాత ఆ వ్యక్తి హింగే డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్‌ని డిలీట్ చేశాడు. ఈ లోగా వాట్సాప్‌లో చాలా సార్లు బాధితురాలు తన సెల్ఫీలు పంపింది. కొన్ని సార్లు వీడియో కాల్ కూడా మాట్లాడింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలన్నీ నిందితుడు మెసేజ్‌లలోనే రాబట్టాడు. 

ఈ సమయంలోనే రిటైర్‌మెంట్ ప్లాన్ అని చెప్పి ఓ ఫేక్ స్కీమ్‌ని సృష్టించాడు. క్రిప్టోకరెన్సీ ఇన్‌వెస్ట్‌మెంట్స్ గురించి చెప్పాడు. అతని మాటలు నమ్మిన శ్రేయా దత్త తన ఫోన్‌లో ఓ క్రిప్టో ట్రేడింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసింది. అందులోనే సేవింగ్స్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో బాగానే రిటర్న్స్ వచ్చాయి. ఆ తరవాతే డబ్బులు విత్‌డ్రా చేసుకోడానికి సవాలక్ష పర్మిషన్స్ అడిగింది. ఆ తరవాత బాధితురాలి సోదరుడు ఆ వ్యక్తి గురించి ఆరా తీశాడు. అప్పుడే అసలు విషయమంతా బయటపడింది. అదో ఫేక్ ప్రొఫైల్ అని అర్థమైంది. AI జనరేటెడ్ ప్రొఫైల్‌ని సృష్టించి మోసం చేశాడు. శ్రేయా దత్తాతో పాటు దాదాపు 40 వేల మంది ఇలాగే మోసపోయారని FBI వెల్లడించింది. ఈ క్రిప్టో కరెన్సీ మోసం విలువ 3.5 బిలియన్ డాలర్ల వరకూ ఉందని వివరించారు.

దీన్నే  Pig Butchering Scam గా పిలుస్తారు. గతంలోనే చాలా మంది నిపుణులు ఈ స్కామ్‌ గురించి హెచ్చరించారు. దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా కొన్ని సూచనలు చేశారు. భారత్‌లో ఈ స్కామ్‌ ద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఫేక్ జాబ్ ఆఫర్ స్కామ్స్‌లోనూ చాలా మంది బాధితులవుతున్నారు. క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కారణంగా నష్టపోతున్నారు. పిగ్ బచరింగ్ అంటే..ఓ వ్యక్తి తనను తాను ఓ ఫ్రెండ్‌లా పరిచయం చేసుకుంటాడు. కాస్త చనువు పెరిగిన తరవాత రకరకాల స్కీమ్స్ పేరు చెప్పి మెల్లగా వలలో పడేస్తారు. ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి ఇన్వెస్ట్‌ చేసేలా ప్రోత్సహిస్తారు. ఇలాంటి స్కామ్స్‌లో చిక్కకోకూడదంటే వాట్సాప్‌లో తెలియని నంబర్స్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. డేటింగ్ యాప్స్‌తోనూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. లింక్స్ ద్వారా యాప్స్‌ని డౌన్‌లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు. 

Also Read: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయుడు మృతి, సెక్యూరిటీ హెల్పర్‌గా వెళ్లి బలి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget