Tamilnadu Viral News: ఆఫీసుకు వచ్చి భర్తతో పాటు మరో యువతిని చితక్కొట్టేసిన భార్య - సీసీ కెమెరాల్లో ఫ్యామిలీ సర్కస్
Tamil Nadu : తమిళనాడులో ఓ భార్య.. భర్త ఆఫీసుకు వెళ్లి కొట్టింది. అదే ఆఫీసులోని మరో మహిళను కూడా కొట్టింది. ఆ భర్త వికలాంగుడు.

Wife Beats Husband: ఫ్యామిలీ సర్కస్‌లో తేడాలొస్తే ఎవరు ఎవర్నికొడతారో ఊహించడం కష్టం. భార్య కొట్టాలనుకుంటే ఇంట్లోనే కాదు.. ఆఫీసుకు వచ్చి కూడా కొడుతుంది. ఇలాంటి ఘటన తమిళనాడులో జరిగింది. ఓ భర్త ఆఫీసులో ఉండగా.. భార్య తన తల్లితో కలిసి వచ్చి దాడి చేసింది. తన భర్తతో వివాహేతర బంధం పెట్టుకున్నారని భావిస్తున్న యువతిపైనా దాడి చేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి.
చెన్నైలో మరమ్మని అనే మహిళ తన భర్త సెంథిల్ నాథన్ పని చేస్తున్న ఆఫీసులోకివచ్చింది. అది ఓ ప్రైవేటు కంపెనీ. నేరుగా అతని వద్దకు వెళ్లి చొక్కాపట్టుకుని ఈడ్చుకుని వచ్చి కొట్టడం ప్రారంభించింది. అతను వికలాంగుడు కావడంతో భార్యను పెద్దగా ఆపలేకపోయాడు. అయితే ఓ మహిళ వచ్చి ఆ భార్య నుంచి భర్త నుంచి కాపాడే ప్రయత్నం చేసింది. దీంతో ఆ భార్య ఆ మహిళపైనా దాడి చేసింది.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
தனியார் அலுவலகத்திற்குள் புகுந்து மாற்றுத்திறனாளி கணவர், சக ஊழியர் மீது தாக்குதல் நடத்திய மனைவி.. வெளியான பரபரப்பு சிசிடிவி காட்சி.. என்ன காரணம்? கணவர் கொடுத்த பேட்டி..#Chennai | #Police | #DifferentlyAbled | #PolimerNews pic.twitter.com/XmZbXnBN5D
— Polimer News (@polimernews) June 20, 2025
దాడి సమయంలో ఆఫీసులో ఉన్న ఇతర వ్యక్తులు జోక్యం చేసుకుని వివాదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సెంతిల్ నాథన్ సహోద్యోగి కూడా మరమ్మనిపై ప్రతిదాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. తనపై భార్యదాడి చేసిందని సెంతిల్ నాథన్ హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశాడు.తన భార్య తనతో విడిపోయిందని.. నెలకు నలభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని ఆ భర్త అంటున్నాడు.
அலுவலகத்திற்குள் புகுந்து தாக்குதல்.. பாதிக்கப்பட்ட மாற்றுத்திறனாளி நபர் மற்றும் பெண் - வெளியான சிசிடிவி காட்சி...!#Chennai #DisabledPeople #CCTV #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/iKUK7Ljzne
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) June 20, 2025
దాడి చేసిందని సెంథిల్ నాథన్ ఫిర్యాదుచేయడంతో మరమ్మనిపై FIR నమోదైంది. వారు పరారీలో ఉన్నారు. లో విడిపోయిన తరువాత ఆ మహిళ డబ్బుల కోసం డిమాండ్ చేస్తోందని.. వికలాంగుడు అయినా వదిలి పెట్టలేదని సెంథిల్ నాథన్ అంటున్నారు
ఎన్ని గొడవలు ఉన్నా దాడి చేయడం కరెక్ట్ కాదని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Eppdi da manasu varuthu
— Negan (@RajPrakul181072) June 20, 2025
Enna vena prblm ah irukalam but Eppdi oru manusha weak ah irutha avana physical ah attack panna manasu varuthu
Manushaney ila





















