Bangalore Rapido issue: అమ్మాయిని కొట్టిన ర్యాపిడో డ్రైవర్ - వీడియో వైరల్ - కానీ ముందు కొట్టింది అమ్మాయే - పూర్తి వీడియో
Bangalore: బెంగళూరులో ఓ అమ్మాయిని ర్యాపిడో డ్రైవర్ కొట్టిన వీడియో వైరల్ గా మారింది. కానీ ముందు ర్యాపిడో డ్రైవర్ పై అమ్మాయి చేసుకున్నట్లుగా పూర్తి వీడియో వెలుగులోకి వచ్చింది.

Bangalore Rapido Lady Viral Video : బెంగళూరులోని జయనగర్‌లో జరిగిన రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణికురాలిని దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. అయితే ముందుగా ఆ మహిళ రాపిడో డ్రైవర్ తో దురుసుగా ప్రవర్తించినట్లుగా ఇంకో వీడియో వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే ?
ఒక జ్యూయలరీ స్టోర్‌లో పనిచేసే మహిళా ఉద్యోగి, BTM లేఅవుట్ నుండి జయనగర్ 3వ బ్లాక్‌కు రాపిడో బైక్ బుక్ చేసుకుంది. బైక్ డ్రైవర్ సుహాస్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంోత పాటు ట్రాఫిక్ సిగ్నల్‌ల పాటించలేదని దారి మధ్యలో ఆపేయమని కోరింది. దీనితో వారి మధ్య వాగ్వాదం జరిగింది. రైడ్‌ను మధ్యలో ఆపి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. చార్జి రూ. 77 చెల్లించడానికి నిరాకరించింది. హెల్మెట్‌ను తిరిగి ఇవ్వలేదు. దీనితో డ్రైవర్ సుహాస్ ఆమెను చెంపపై కొట్టాడు, దీని వల్ల ఆమె నేలపై పడిపోయింది. ఓ వ్యక్తి దీన్ని రికార్డు చేయడంోత సోషల్ మీడియాలో వైరల్ అయింది.
A #Rapido driver in Jayanagar, #Bengaluru, attacked a woman after she confronted him about reckless driving. He slapped her so hard that she fell to the ground. The police have initiated an investigation. pic.twitter.com/2bEcSH8QI9
— Ashish (@KP_Aashish) June 16, 2025
మహిళే తనను మొదట కొట్టిందన్న డ్రైవర్
ర్యాపిడో డ్రైవర్ మాత్రం మహిళ తనను మొదట కొట్టిందని, టిఫిన్ బాక్స్‌తో రెండుసార్లు దాడి చేసిందని పేర్కొన్నాడు. మహిళ మొదట డ్రైవర్‌ను కొట్టినట్లు సీసీఫుటేజీ వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత అతను ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
#Rapido case - New CCTV footage shows the Rapido customer hitting the Rapido rider/captain twice before he retaliates. The customer had claimed that she was assaulted by the rider for questioning rash driving. pic.twitter.com/waMMqxXsb5
— Harish Upadhya (@harishupadhya) June 16, 2025
కేసు నమోదు
జయనగర్ పోలీసు స్టేషన్ లో మొదట నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేసింది. చెంప దెబ్బ తిన్న మహిళ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. కానీ జూన్ 16, 2025న, మహిళ ఫిర్యాదు చేయడంతో, డ్రైవర్ సుహాస్‌పై FIR నమోదు చేశారు.
In a major twist in the Bengaluru Rapido rider assault case, newly emerged CCTV footage reveals a version of events that contradicts the earlier claims made by the woman passenger.#Bengaluru #Jayanagar #Rapido https://t.co/zoFmNCy3KD pic.twitter.com/bmMXxy1AGq
— Hate Detector 🔍 (@HateDetectors) June 16, 2025
కర్ణాటకలో బైక్ టాక్సీ సర్వీసెస్ బంద్ పాటిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు బైక్ టాక్సీ సర్వీసెస్‌ను సరైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ లేనందున నిషేధించింది. దీనితో రాపిడో తన బైక్ టాక్సీ సర్వీస్‌ను జూన్ 16, 2025 నుండి నిలిపివేసి, “బైక్ పార్సెల్” సర్వీస్‌ను ప్రారంభించింది.





















