Peach Candy: పీచు మిఠాయిపై నిషేధం ఎందుకు? ఏమిటి? ఈ విషయాలు తెలుసా?
చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే పీచు మిఠాయి హఠాత్తుగా వార్తల్లోకి వచ్చింది. తమిళనాడు, పుదుచ్చేరిరాష్ట్రాల్లో ఏకంగాదీనిని నిషేధించారు.
Peach Candy: చిన్నారుల(Children) నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి(Peach candy) హఠాత్తుగా వార్తల్లో(News)కి వచ్చింది. తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి(Puducheri) రాష్ట్రాల్లో ఏకంగా దీనిని నిషేధించారు. దీనికి కారణం.. పీచు మిఠాయికి వినియోగించే `కలర్`(Colour)! ఔను. నిజమే.. పీచు మిఠాయి మనకు సాధారణంగా గులాబీ కలర్‌లో ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల ఈ రంగులు మారుతుంటాయి. పసుపు, నీలం రంగుల్లోనూ పీచు మిఠాయిని విక్రయిస్తారు. అయితే.. ఈ రంగే.. ఇప్పుడు తీవ్ర వివాదం అయింది. ఈ రంగులు మానవ శరీరంలో క్యాన్సర్(Cancer) కారకాలను ప్రేరేపిస్తాయని.. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం అత్యంత ఎక్కువని వైద్యులు(Doctor) నిర్ధారించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పీచు మిఠాయిపై నిషేధం విధించారు.
ఎలా తయారు చేస్తారు?
సాధారణంగా పీచు మిఠాయి(Peach candy)ని.. పంచదార(Sugar)తోనే తయారు చేస్తారు. రెండో పదార్థం వినియోగించరు. అయితే.. వినియోగదారులను ఆకర్షించేందుకు పలు రకాల రంగులు(Colours) కలుపుతారు. తద్వారా.. పీటు మిఠాయి ఎంతో ఆకర్షణగా ఉండి.. చూడగానే నోరు ఊరించేలా చేస్తుంది. ఇది తియ్యగా, నోటిలో వేసుకొంటే కరిగిపోయే స్థితి ఉండడంతో పిల్లలు, యువతీ యువకులు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. పెద్దలు కూడా దీనిని తినేందుకు ఇష్టపడతారు.
విదేశీ పర్యాటకుడి ఫిర్యాదుతో
ఎన్నో ఏళ్లుగా చిరుతిళ్లలో ఒకటిగా ఉన్న పీచు మిఠాయిపై పుదుచ్చేరిలో ఒక విదేశీ పర్యాటకుడు(Foriegn Tourist) అనుమానం వ్యక్తం చేశాడు. పుదుచ్చేరి సహా.. తమిళనాడు(Tamilnadu), విశాఖపట్నం(Vishakapatnam) బీచ్‌లలో వ్యాపారులు.. పీచుమిఠాయిని బళ్లపై విక్రయిస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు, బీచ్‌లు, ప్రజల అధికంగా గుమిగూడే ప్రాంతాల్లో తెలుపు, నీలం రంగుల్లో పీచు మిఠాయి ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. దీనిని కొనుగోలు చేసిన ఓ విదేశీ పర్యాటకుడు.. దీని రంగుపై అనుమానం వ్యక్తం చేసి.. పుదుచ్చేరిలో ఫిర్యాదు చేశారు. విదేశీ పర్యటకుడి(Foriegn Tourist) ఫిర్యాదుతో.. పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పుదుచ్చేరి రాష్ట్ర ఆహార భద్రతా శాఖ అధికారులు.. వాటి శాంపిళ్లను పరిశోధనల కోసం ల్యాబ్‌కు పంపించారు. క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే ‘రొడమైన్ బి’ అనే రసాయనం కలుపుతున్నట్లు పరీక్షలో నిర్ధారణ అయింది. దీంతో, పీచు మిఠాయి విక్రయాలకు తాత్కాలిక నిషేధం విధించిన పుదుచ్చేరి ప్రభుత్వం, పీచు మిఠాయి తయారీ ఆహార భద్రత శాఖ నుంచి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ పొంది విక్రయాలు చేపట్టవచ్చని ఆదేశించింది.
తమిళనాడులోనూ..
పుదుచ్చేరికి పొరుగున ఉన్న తమిళనాడులోనూ పీచు మిఠాయిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో చెన్నై మెరీనా బీచ్‌లో విక్రయిస్తున్న పీచు మిఠాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి నమూనాలను పరిశోధనలకు పంపిన నేపథ్యంలో, ఆ పీచు మిఠాయిలో కూడా క్యాన్సర్ వ్యాధికి కారణమైన `రొడమైన్ బి` రసాయనం కలుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయమై ఆహార భద్రతా శాఖ సిఫారసులతో రాష్ట్రంలో పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘించి విక్రయిస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది. అంటే.. క్యాన్సర్ కారక పదార్థాలున్నట్లు నిర్ధారణ కావడంతో పీచు మిఠాయి విక్రయాలపై అటు పుదుచ్చేరి, ఇటు తమిళనాడు ప్రభుత్వం కూడా నిషేధం విధించాయన్నమాట.
ఏంటీ రసాయనం
తమిళనాడు ఆహార భద్రతా శాఖ వెల్లడించిన వివరాల మేరకు `రొడమైన్ బి` రసాయం జౌళి రంగానికి సంబంధించిన వృత్తిలో వినియోగిస్తారన్నారు. అంటే దుస్తులను వివిధ రంగుల్లోకి మార్చేందుకు ఈ రసాయనాన్ని వాడతారు. వీటిని ఎట్టి పరిస్థితిలోనూ ఆహారంగా తీసుకోకూడదు. అయితే.. ఈ విషయం తెలియక.. వీధి వ్యాపారులు ఈ రసాయనాన్ని పీచు మిఠాయిలో వినియోగిస్తున్నారని తెలిపారు. సాధారణంగా తినుంబండారాల్లో ఉంటే రసాయనాలు 24 గంటల్లో మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కానీ `రొడమైన్ బి`(Rodmine-B) రసాయనం(Chemical) శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు 45 రోజులు పడుతుంది.
ప్రమాదం ఇదీ..
`రొడమైన్ బి`(Rodmine-B) రసాయనం అధిక మోతాదులో వినియోగిస్తే..(పీచు మిఠాయిలో ఎక్కువగానే వాడుతున్నారు) కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థ, మెదడు తదితరాలపై ప్రభావం చూపుతుంది. శరీరానికి రక్షణగా ఉండే పరమాణువులను నిర్వీర్యం చేసే గుణం ఈ రసాయనంలో ఉంది. దీంతో ఈ రసాయనంతో కూడిన పీచు మిఠాయిని తీసుకున్నవారికి క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సైతం హెచ్చరించడం గమనార్హం.