Condoms : దేశంలో కండోమ్స్ ఎక్కువ వాడేది ఆ రాష్ట్రంలోనే - ఆంధ్రప్రదేశ్ వాళ్లు సూపర్ ఫాస్టే !
Condoms Most Used State : శృంగారంలో రక్షణ పద్దతులు పాటించడం.. లైంగికవిజ్ఞానంలో భాగం. ఇది ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కండోమ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఏపీ చాలా ముందు ఉంది.
Where Are Condoms Most Used in India : సురక్షితమైన శృంగారానికి మేలైన కండోమ్ వాడాలని ప్రకటనలు వస్తూ ఉంటాయి. కండోమ్ వాడటం వల్ల ఎన్నో రకాల రోగాల నుంచి రక్షణ పొందవచ్చు.. అలాగే అవాంచిత గర్భాలు రాకుండా కూడా చూసుకోవచ్చు. ఇలాంటి లైంగిక విజ్ఞానం మన దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఎంత ఎక్కువగా ఉందో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ డిపార్టుమెంట్ ఓ సర్వే చేసింది. అందులో పలు రాష్ట్రాల గురించి ఆశ్చర్యకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
2021-22 ఏడాదిలో దేశంలోని అన్నిరాష్ట్రాల్లో కల్లా దాద్రా నగర్ హవేలీలో ఎక్కువ నిష్పత్తిలో కండోమ్ వినియోగం జరిగింది. అ రాష్ట్రంలో ప్రతి పదివేల మందిలో 993 మంది శృంగారం సమయంలో కండోమ్ వినియోగిస్తున్నారు. అయితే అది చాలా చిన్న రాష్ట్రం. కానీ కాస్త పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా అదే స్థాయిలో అవగాహనతో ఉంటున్నారు. ప్రతి పదివేల మందిలో 978 జంటలు అవాంచిత గర్భం... ఇతర సమస్యలు రాకుండా కండోమ్‌లు వాడుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ డిపార్టుమెంట్ సర్వేలో తేలింది.
మాతృభాషలోనే పేషెంట్లకు ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్లు, ఎక్కడో తెలుసా?
అయితే మెట్రో నగరం అయిన బెంగళూరు ఉన్న కర్ణాటకలో జంటలు మాత్రం కండోమ్ వాడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. అక్కడ పదివేల మందిలో కేవలం 307 జంటలు మాత్రమే కండోమ్‌లు వినియోగిస్తున్నాయి. పుదుచ్చేరిలో ఈ సంఖ్య 960, పంజాబ్‌లో 895, హర్యానాలో 685 జంటలు .. ప్రతి పదివేల మందిలో కండోమ్స్ వాడుతున్నారు. ఈ సర్వే నివేదికలో కొన్ని రాష్ట్రాలు బాగా వెనుకబడ్డాయి. సురక్షిత శృంగారం కోసం ఖచ్చితంగా కండోమ్ వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ నివేదిక నివేదిక విడదల చేసింది. ఆ నివేదిక ప్రకారం భారత్‌లో రాను రాను కండోమ్ ల వినియోగం తగ్గిపోతోంది. బారత్‌లో ప్రతి సంవత్సరం 3.3 బిలియన్ల కండోమ్‌లు వినియోగిస్తూంటారు. ఇందులో 530 మిలియన్లు ఉత్తరప్రదేశ్‌లో వినియోగం అవుతుంటాయి. యూపీ అతి పెద్ద రాష్ట్రం కావడమే దీనికి కారణం. దేశంలో లైంగిక వ్యాధుల బారిన యువత పకుండా.. సురక్షిత శృంగారానికి ప్రాధాన్యం ఇవ్వాలంటే కండోమ్‌లు వాడాలని ఇప్పటికీ కేంద్రం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.