Jaggi Vasudev : సొంత కూమార్తెకు పెళ్లి - ఇతరుల కుమార్తెలకు సన్యాసమా ? జగ్గీ వాసుదేవ్‌కు మద్రాస్ హైకోర్టు సూటి ప్రశ్న
Madras HC : జగ్గీ వాసుదేవ్ తమ కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం తీసుకునేలా చేసి తన ఆశ్రమంలోనే ఉండేలా చేసుకున్నారని ఇద్దరు మహిళల తండ్రి హైకోర్టును ఆశ్రయించారు . విచారణలో ఏం జరిగిందంటే ?
Jaggi Vasudev encouraging other women to be hermitesses : అథ్యాత్మక వేత్త జగ్గీ వాసుదేవ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. సొంత కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి సంసార జీవితం చేసుకోమని ఆశీర్వదించిన ఆయన.. ఇతరుల కుమార్తెల్ని మాత్రం ఎందుకు సన్యాసులుగా మారని ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు. తమ ఇద్దరు కుమార్తెలకు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ వాష్ చేసి.. పెళ్లి వంటి ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండాలని చెప్పారని వారు .. అందుకే పెళ్లిని వద్దనుకుని జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో చేరిపోయారని .. తమ పిల్లల్ని తమకు అప్పగించాలని ఓ తండ్రి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు విచారణకు వచ్చిన సమయంలో న్యాయమూర్తులు ఈ సందేహం వ్యక్తం చేశారు.
అమెజాన్ అయినా సరే ఆఫీసుకు రమ్మంటే రాజీనామానే - ఇలా ఉన్నారేంటి ?
ఇషా ఫౌండేషన్ ను నిర్వహిస్తున్న జగ్గీ వాసుదేవ్ పెద్ద ఎత్తున యోగా తో పాటు అథ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూంటారు. ఈ ప్రవచనాల్లో ఎక్కువగా ప్రాపంచిక విషయాలు, పెళ్లి వంటి అవసరం లేదని.. అధ్యాత్మకి జీవనంలో గడిపేయాలని సలహాలిస్తూ ఉంటారు. వాటితో స్ఫూర్తి పొందిన యువతులు పెళ్లి చేసుకోకుండా...కుటుంబ బంధాలను కూడా త్యాగం చేసి ఇషా ఫౌండేషన్ ఆశ్రమాల్లో చేరిపోతున్నారు. ఇలా తమ ఇద్దరు పిల్లలు ఇషా ఫౌండేషన్ లో చేరారని వారి ఆచూకీ తెలియడం లేదని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేసి రిటైరైన కామరాజ్ కోర్టును ఆశ్రయించారు.
తన ఇద్దరు కూతుళ్లు బాగా చదువుకున్నారని దాదాపుగా నలభై ఏళ్లు ఉన్న వారిని జగ్గీ వాసుదేవ్ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి వద్దని బ్రెయిన్ వాష్ చేశారని వారు జుట్టు కత్తిరించుకుని యోగినిలుగా మారిపోయారన్నారు. వారిని తమకు చూపించడం లేదని.. చూడనీయడం లేదని..మాట్లాడనీయడం లేదని కూడా చెప్పారు. అయితే ఆ ఇద్దరు కుమార్తెలు కోర్టులో తమను ఎవరూ బలవంతం చేయలేదని తమ ఇష్ట ప్రకారమే ఇషా ఫౌండేషన్ లో ఉంటున్నామని స్పష్టం చేశారు. తమను ఎవరూ బంధించడం లేదని కూడా చెప్పారు. వారిద్దరూ తమ అంగీకారంతో ఉంటున్నామని చెప్పినందున ఆ తండ్రి పిటిషన్ ను కొట్టి వేయాలని ఇషా ఫౌండేషన్ తరపు లాయర్ కోరారు.
మరో ప్రాణం తీసిన "పని ఒత్తిడి" - ఐదు పేజీల లేఖ రాసి బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ ఆత్మహత్య
అయితే ఈ కేసు విషయంలో న్యాయమూర్తి పలు సందేహాలు వ్యక్తం చేశారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు పెళ్లి చేసి హ్యాపీ లైఫ్ గడపమని పంపారని..కానీ ఇతరుల కుమార్తెలకు ఎందుకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇషా ఫౌండేషన్ పై ఇలాంటికేసులు చాలా ఉన్నాయని పిటిషనర్ తరపు లాయర్లు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లడంతో... అలాంటి కేసులన్నీ తమ ఎదుట ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది.