Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు బాగా పొగమంచు, చలి సాధారణమే - ఐఎండీ
Hyderabad News: హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Weather Latest News: తెలంగాణ వ్యాప్తంగా కింది స్థాయిలోని గాలులు ఆగ్నేయ, దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలోని ఏ జిల్లాల్లోనూ నేడు ఎల్లో అలర్ట్ జారీ చేయలేదు. సూర్యోదయం 6.49 గంటలకు, చంద్రోదయం 11.59 గంటలకు ఉండనుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6.03 నిమిషాలకు, చంద్రాస్తమయం అర్ధరాత్రి 12.01 నిమిషాలకు ఉంటుందని వాతావరన అధికారులు తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ, దక్షిణ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీలుగా నమోదైంది. 68 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తూర్పు, ఆగ్నేయ దిశల్లో గాలులు వీస్తున్నట్లు చెప్పారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపు వాతావరణం పొడిగా ఉండగా.. రాయలసీమలో కూడా వర్షాలేమీ పడే అవకాశం లేదని తెలిపారు. కానీ, పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.