By: ABP Desam | Updated at : 28 Apr 2023 05:44 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమ విదర్బలోని ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి.
తెలంగాణలో మరో నాలుగు రోజులు చల్లని వాతావరణం ఉండబోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ, కర్ణాటక మీదుగా ఏర్పడిన ద్రోణి కారణంగా ఉత్తరాది జిల్లాలు, తూర్పు ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వాన పడబోతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలుగా నల్లగొండలో నమోదు అయింది. వచ్చే మూడు రోజులు అదే స్థాయిలో అంటే 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గురువారం కూడా ఏ జిల్లాలోనూ 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. నల్లగొండలో 37, ఆదిలాబాద్‌లో 36.8, భద్రాచలం, ఖమ్మంలో 36.6, రామగండంలో 36.4, నిజామాబాద్‌లో 35.2, హన్మకొండలో 33, హైదరాబాద్‌లో 32.7, మెదక్‌లో 32.6 డిగ్రీల ఉష్ణోగ్రతుల నమోదయ్యాయి. డిగ్రీల చొప్పున నమోదైనట్లు వాతావరణ కేంద్రం వివరించింది.
గురువారం రాత్రి కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వడగండ్ల, తేలికపాటి వర్షాలు కురిశాయి. సిరిసిల్ల, మెదక్, నిర్మల, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. గాలులు కూడా బీభత్సం సృష్టించాయి. ఇవాళ రేపు, ఆదివారం, సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజమాబాద్, నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
ఏపీలో వాతావరణం ఇలా
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
‘‘ గాలుల సంఘమం మరింత బలపడి కర్నూలు, నంధ్యాల ప్రాంతంపైన విరుచుకుపడింది. దీని వలన ఉదయం నుంచి విపరీతం అయిన పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కర్నూలు నగరంతోపాటుగా నంధ్యాలలో చూశాం. ఈ వర్షాలు మరో రెండు గంటలు కొనసాగి తగ్గుముఖం పట్టనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.
Europa Clipper: మీరు కాకపోయినా మీ పేరైనా గురుగ్రహంపైకి వెళ్లాలనుకుంటున్నారా? ఈ నాసా ఆఫర్ మీకోసమే
Delivery Man Letter: ఫ్లవర్ పాట్ పగులగొట్టాడు, ఇంటర్నెట్‌లో హీరో అయిపోయాడు- ఎలాగంటే!
EFLU: ఇఫ్లూలో 132 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అర్హతలివే!
Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు!
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు